రాష్ట్రీయం

ద.మ.రైల్వేకు ఫస్ట్ బెస్ట్ ఇన్నోవేషన్’ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: భారత రైల్వేలో 2016-17లో చేపట్టిన ఉన్నత ఆవిష్కరణలు (బెస్ట్ ఇన్నోవేన్) స్కీంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ‘్ఫస్ట్ బెస్ట్ ఇన్నోవేషన్’ అవార్డును దక్కించుకుంది. రైళ్ల రాకపోకల నిర్వహణలో కీలకమైన ‘ఆటోమేటిక్ సింగిల్ కార్ టెస్ట్ రిగ్’ను తయారు చేసి ప్రయోగాత్మకంగా మంచి ఫలితాలను రాబట్టినందుకు గాను బెస్ట్ ఇన్నోవేషన్స్‌లో ఫస్ట్ అవార్డును ద.మ.రైల్వే సొంతం చేసుకుంది. లాలాగూడ క్యారేజ్ వర్క్‌షాప్ కొత్త ఆలోచనతో ఆటోమేటిక్ సింగిల్ కార్ టెస్ట్ రిగ్‌ను మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ ఆధారంగా అభివృద్ధి చేసింది. ఈ అవార్డు కింద రూ.3 లక్షల నగదు బహుమతి లభించింది. ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ ఈ మొత్తాన్ని వర్క్‌షాప్‌కు బహుమతిగా అందజేశారు. రెండో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును లక్నోలో ఉన్న రైల్వే డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్‌డిఎస్‌ఓ)కి దక్కగా, మూడవ అవార్డు తూర్పు రైల్వే (ఈస్ట్రన్ రైల్వే)కి లభించింది. కోచ్‌ల ఎయిర్‌బ్రేకింగ్ సిస్టమ్ పనితీరు సక్రమంగా ఉండే విధంగా ఆటోమేటిక్ సింగిల్ కార్ టెస్ట్ రిగ్‌ను లాలాగూడ వర్క్‌షాప్ రూపొందించింది. ఈ విధానం భవిష్యత్‌లో రైల్వేకి ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా ప్రయాణీకుల భద్రతకు సంబంధించి సింగిల్ కార్ ఎయిర్ బ్రేకింగ్ విధానం ఎంతో ఉపయోగమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న మాన్యువల్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్‌లో చాలా సార్లు వినియోగించాల్సి రావడం, టెస్టింగ్ పారామీటర్స్‌ను నమోదు చేయడం సాధ్యం కావడం లేదు. టెస్ట్ రిగ్ ఆటోమేటిక్ విధానం వల్ల ఎక్కువసార్లు వినియోగించే పని లేకపోవడం, మానవ తప్పిదాలకు అవకాశం లేకపోవడం, టెస్ట్ పారామీటర్స్‌ను నమోదు చేయడం, సంబంధిత డేటాను డేటా బేస్‌లో నిల్వ ఉంచేందుకు అవకాశం ఉందని రైల్వే వెల్లడించింది.