రాష్ట్రీయం

మొత్తం ఇండెంట్ 412.5 టిఎంసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండడంతో కృష్ణా బోర్డు ఆదేశం మేరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఈ ఏడాది నీటి వినియోగంపై ఇండెంట్‌ను సమర్పించాయి. 138.5 టిఎంసి కావాలని తెలంగాణ, 273 టిఎంసి కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నివేదికలు అందించాయ. ఈ విషయమై ఈ నెలాఖరులోగా కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోనుంది. పోతిరెడ్డిపాడుకు 84 టిఎంసి, హంద్రీనీవా- మచ్చుమర్రికి 25 టిఎంసి, నాగార్జునసాగర్ కుడికాల్వకు 96 టిఎంసి, ఎడమకాల్వకు 27 టిఎంసి, కృష్ణా డెల్టాకు 38 టిఎంసి కావాలని ఏపీ తన నివేదికలో పేర్కొంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని, ఈ రెండు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బోర్డుకు బదలాయించాలని, కాల్వల నిర్వహణను రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం సవరించిన ఇండెంట్ ప్రకారం 138.5 టిఎంసి కావాలని కోరింది. రెండు ప్రాజెక్టుల్లో 530 టిఎంసికి 470 టిఎంసి నీటి లభ్యత ఉంది.