రాష్ట్రీయం

ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: ఖమ్మం రీజియన్ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, టిఎస్‌ఆర్టీసీ స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర కమిటీ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. ఎస్‌డబ్ల్యుఎఫ్ కార్యదర్శి గంగాధర్, ప్రచార కార్యదర్శి పి రవీందర్‌రెడ్డి, కోశాధికారి ఎవి రావు నేతృత్వంలోని బృందం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసింది. ఈ సందర్భంగా కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం రీజియన్‌లో గుర్తింపు సంఘం ఎస్‌డబ్ల్యుఎఫ్ కార్మికుల సమస్యలపై అహర్నిశలు పోరాడుతుందన్నారు. అయితే కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనేక సర్వీసుల్లో పనిభారం పెంచుతున్నారని, ఖమ్మం-కోదాడ స్పెషల్ ఆఫ్ సర్వీసులను ఓటి డ్యూటీలుగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్ల ఆన్ సీరియల్ బదిలీలను రద్దు చేయాలని, సత్తుపల్లి-కూకట్‌పల్లి, మదిర-ప్రగతినగర్ సర్వీసులకు మూడు రోజుల మస్టర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిస్పెన్సరీలో మహిళా డాక్టర్లను కేటాయించాలని, ఖమ్మం-2 డిపో ప్రారంభించాలని, ఆర్‌ఎం/ డివిఎం వద్ద కార్మికుల అప్పీళ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మొత్తం 28 డిమాండ్లతో సమ్మె నోటీసు జారీ చేశారు. వచ్చేనెల 7వ తేదీ తరువాత ఏ రోజు నుంచైనా సమ్మె జరుగుతుందని, ఇందుకు ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించాలని రవీందర్‌రెడ్డి హెచ్చరించారు.