రాష్ట్రీయం

2 నుండి నిజామాబాద్ -తిరుపతి సూపర్‌ఫాస్ట్ రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్ (నిజామాబాద్), అక్టోబర్ 24: నిజామాబాద్ నుండి తిరుపతి మధ్య నవంబర్ 2వ తేదీ నుండి రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రాగానే నిజామాబాద్ నుండి తిరుపతి వెళ్లేందుకు కేవలం 16 గంటల 10 నిమిషాల వ్యవధి మాత్రమే పడుతుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అనునిత్యం సుమారు 200 మంది వరకు భక్తులు తిరుపతి వెళ్తుంటారు. నిజామాబాద్ నుండి తిరుపతి వెళ్లాలంటే ఆర్టీసీ, ప్రైవేటు అద్దె బస్సులతో పాటు పలు రైళ్లు అందుబాటులో ఉండగా, మెజార్టీ భక్తులు సౌకర్యవంతంగా ఉంటుందనే భావనతో రైలు ప్రయాణానికే మొగ్గుచూపుతారు. నిజామాబాద్ నుండి తిరుపతి వెళ్లేందుకు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో వారాంతపు రైలు నిజామాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, వీటిలో రద్దీ ఎక్కువగా ఉండడం, రిజర్వేషన్లలో టికెట్లు లభించకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నిజామాబాద్ నుండి తిరుపతి వరకు ప్రత్యేక రైలును నడిపించాలని భక్తులు గత కొంతకాలంగా రైల్వే అధికారులను కోరుతూ వస్తున్నారు. ప్రయాణికుల అభ్యర్థనలను, స్థానికంగా నెలకొని ఉన్న రద్దీని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎట్టకేలకు ఈ మార్గంలో కొత్త రైలు సర్వీసును ప్రవేశపెట్టేందుకు సంసిద్ధత కనబర్చారు. నవంబర్ 2వ తేదీ నుండి నిజామాబాద్ - తిరుపతి మధ్యన రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు అధికారులు అంగీకరించారని నిజామాబాద్ రైల్వే స్టేషన్ మాస్టార్ బబ్లూమీనా తెలిపారు. ఈ రైలు ప్రారంభమైతే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.