రాష్ట్రీయం

గద్వాల-మాచెర్ల రైల్వేలైన్ పనులను వెంటనే చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: గద్వాల్- మాచెర్ల కొత్త రైల్వే లైను నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కోరారు. నంది ఎల్లయ్య బుధవారం గోయల్‌ను కలిసి ఈ మేరకు ఒక లేఖను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, రైల్వే శాఖ సయుక్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం ఖర్చును భరిస్తోందన్నారు. 1,160.47 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే పనులు వెంటనే ప్రారంభం అవుతాయని ఎల్లయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టు పట్ల సవతి ప్రేమను కనబరుస్తున్నారని నంది ఎల్లయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం ముందుకు వచ్చి నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గద్వాల్-మాచెర్ల రైల్వే లైను నిర్మాణం పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్న చంద్రశేఖరరావు కొత్తపల్లి-మనోహరాబాద్ ప్రాజెక్టుపట్ల మక్కువ చూపిస్తున్నారని ఎల్లయ్య ఆరోపించారు. ఈ కారణం చేతనే రైల్వే శాఖ గద్వాల్-మాచెర్ల రైల్వే లైను నిర్మాణానికి వెంటనే నిధులు కేటాయించాలని ఆయన కోరారు.