రాష్ట్రీయం

‘ఆధార్’ లేకుంటే ఎంసెట్‌కు నోఎంట్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 28: ఎపి ఎంసెట్-2016కు దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ గుర్తింపుసంఖ్య కలిగివుండాలని, లేని పక్షంలో ప్రవేశ పరీక్షకు అనుమతించేది లేదని ఎపి ఎంసెట్-2916 కన్వీనర్ ఆచార్య సిహెచ్ సాయిబాబు స్పష్టం చేశారు. ఎపి ఎంసెట్ నోటిఫికేషన్‌ను శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి జారీచేయనున్నట్టు ఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ జెఎన్‌టియులోని తన ఛాంబర్‌లో గురువారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో డాక్టర్ సాయిబాబు మాట్లాడారు. ఎంసెట్‌కు హాజరుకాదలచిన విద్యార్థులకు ఆధార్ లేని పక్షంలో తక్షణం నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షకు చేసుకునే దరఖాస్తులో విద్యార్థులు 12 అంకెల ఆధార్ విశిష్ట సంఖ్యను తప్పనిసరిగా సూచించాల్సి ఉందన్నారు. ఆధార్ నమోదు చేయించుకున్నాక అప్పటికపుడు జనరేట్ అయ్యే ఎన్‌రోల్‌మెంట్ నెంబర్‌ను గుర్తిస్తారా? అన్న ప్రశ్నకు ఎన్‌రోల్‌మెంట్ నెంబర్‌ను గుర్తించేది లేదన్నారు.
తప్పనిసరిగా విశిష్ట సంఖ్యనే దరఖాస్తులో తెలియజేయాలని ఆయన స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు, మాల్ ప్రాక్టీస్‌కు ఏ మాత్రం ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ చర్యల్లో భాగంగానే ఆధార్‌ను తప్పనిసరి చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది నిర్వహించిన చిలకలూరిపేట రీజనల్ సెంటర్‌ను ఈ ఏడాది తొలగించామని, కొత్తగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఒక రీజనల్ సెంటర్ ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ఎపిలో మొత్తం 23 రీజనల్ సెంటర్లు, సుమారు 300 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు. గతేడాది తెలంగాణలో 3 రీజనల్ సెంటర్లు, 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామని, ఈ ఏడాది ఎన్ని సెంటర్లు ఏర్పాటుచేయాలన్న విషయమై ఇంకా నిర్ణయించలేదని, త్వరలో తెలియజేస్తామన్నారు. ఎంసెట్-2016 ప్రవేశ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోందని, పరీక్షా పత్రాలను నాలుగైదు దశల్లో తయారుచేస్తామని వివరించారు. గతేడాది పరీక్షల నిర్వహణకు తగిన సమయం లేకపోయినా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సంవత్సరం పరీక్షలకు వ్యవధి తగినంత ఉండటంతో అంతా పకడ్బందీగా, పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్టు డాక్టర్ సాయిబాబు చెప్పారు. ఎంసెట్ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేయనున్న నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ఎంసెట్‌ను ఏప్రిల్ 29న నిర్వహించనున్నామన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామని, మార్చి 21వ తేదీలోగా విద్యార్థులు తమ దరఖాస్తులను దాఖలు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఏప్రిల్ 29న నిర్దేశిత కేంద్రాలలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఉదయం 10నుండి ఒంటి గంట వరకు, అగ్రికల్చర్-మెడిసిన్ పరీక్షను మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని డాక్టర్ సాయిబాబు వివరించారు.