రాష్ట్రీయం

బాబును కలిసిన రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ టిడిపి వ్యవహారాలపై చర్చించేందుకు 28న శనివారం అమరావతికి రావాలని, అక్కడే ఇటీవలి పరిణామాలపై చర్చించి నిర్ణయం తీసుకుందామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు.
శుక్రవారం ఇక్కడ లేక్‌వ్యూ విశ్రాంతి భవనంలో చంద్రబాబును టిటిడిపి నేతలు కలిశారు. సమావేశానికి వివాదానికి కారణమైన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు హాజరయ్యారు. సమావేశం సుదీర్ఘంగా సాగినా, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని వివరించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకు తన వైఖరిని తెలియచేసినట్లు తెలిసింది. ఈ అంశాలపై చర్చిం చుకునేందుకు పార్టీ నేతలు అమరావతికి రావాలని చంద్రబాబు సూచించారు. కాగా సమావేశానికి రేవంత్ రెడ్డి వెళ్తారా? లేదా? అనేది ప్రశ్నార్ధకం.

చిత్రం..తెలంగాణ తెదేపా నేతలతో లేక్‌వ్యూలో సమావేశమైన చంద్రబాబు