రాష్ట్రీయం

జన్మభూమిని మరవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 28: కర్మభూమికి తోడ్పడండి.. జన్మభూమి అభివృద్ధికి సహకరించండి.. అంటూ విదేశాల్లోని తెలుగువారికి పిలుపు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తొమ్మిది రోజుల పాటు అమెరికా, యుఎఇ, బ్రిటన్‌లో పెట్టుబడుల ఆకర్షణ కోసం పర్యటించి, రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత, తన పర్యటన వివరాలను విజయవాడ సిఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి కొత్త రూపు ఇచ్చేలా ప్రపంచంలోని ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుసువచ్చేందుకు ఈసారి విదేశీ పర్యటనలో ప్రాధాన్యత ఇచ్చానన్నారు. 10 బిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులకు సానుకూలత లభించిందన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దీపావళి రోజున అమెరికాలోని వ్యవసాయ క్షేత్రంలో గడిపానన్నారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో తెలుగువారు 25 లక్షల మంది ఉన్నారన్నారు. గల్ఫ్ దేశాల్లో 9 లక్షల వరకూ తెలుగువారు ఉన్నారన్నారు. వీరిలో ఎక్కువ వంది కార్మికులేనన్నారు. కానీ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అభివృద్ధిలో తెలుగువారు భాగస్వాములన్నారు. అక్కడి అత్యంత ధనికులు తెలుగువారేనన్నారు. ఉన్నత ఉద్యోగులుగా అక్కడ చేరి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగారన్నారు. ఒక మంచి సంప్రదాయానికి నాంది పలికారన్నారు. కర్మభూమికి సేవ చేస్తూ, జన్మభూమి అభివృద్ధికి తోడ్పడండని వారికి పిలుపునిచ్చానన్నారు. అక్కడి వారి అభివృద్ధికి సహకరిస్తూ, రెండింటినీ బ్యాలెన్సు చేయాలన్నారు. లేకపోతే, అక్కడి నుంచి సంపద తరలించుకుపోతున్నామన్న అభిప్రాయం అక్కడివారిలో కలిగే అవకాశం ఉందన్నారు. తాను ఇచ్చిన పిలుపునకు ప్రవాసాంధ్రుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఫెట్టుబడులను ఆకర్షించగలిగామని, కొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నామన్నారు.
3 ఖండాలు.. 7 నగరాలు.. 9 రోజులు.. 50కి పైగా చర్చలు.. 800 మంది సిఇఒలు, పారిశ్రామికవేత్తలతో
సమావేశాలు.. 5 అతిముఖ్యమైన ఎంఒయులు.. 10 బిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులపై సానుకూలత తన పర్యటనలో సాధించానని తెలిపారు. గతంలో ఐటి రంగం, నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి సారించేవాడినని, కానీ ఈ సారి వ్యవసాయ రంగంలో సాంకేతికత కోసం ప్రయత్నిస్తూనే, ఆ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు కృషి చేశానన్నారు. వ్యవసాయ ఉత్తత్తుల దిగుబడులు పెంచాలని, సేద్యాన్ని లాభసాటిగా మార్చాల్సి ఉందన్నారు. ఇందుకు సాంకేతిక అనుసంధానం చేయాలన్నారు. దీనిపై ఎక్కువగా ఆలోచించానన్నారు. అమెరికా పర్యటన వ్యవసాయాభివృద్ధికి కొత్త రూపు ఇచ్చేందుకు తోడ్పడిందన్నారు. ప్రపంచంలోని ఉత్తమ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకురావడమే ధ్యేయంగా పర్యటించానన్నారు.
ఏరోసిటీ నిర్మాణానికి 10 వేల ఎకరాలు అవసరమం అవుతుందని, అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు వచ్చే నెల మూడో వారంలో ఆ సంస్థ రాష్ట్రానికి రానుందన్నారు. ఎమిరేట్స్ దుబాయ్ సిఇఒను ఎపిలో విమానాశ్రయం నిర్మించాలని, రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల నుంచి దుబాయ్‌కు విమానాల సర్వీసులు నడపాలని కోరినట్లు తెలిపారు. ఎపిని ఎమిరేట్స్ హబ్‌గా మార్చుకోవాలని, ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారన్నారు.
వ్యవసాయ క్షేత్రాల్లో గడిపా..
దీపావళి రోజున అమెరికాలోని వ్యవసాయ క్షేత్రాల్లో గడిపానని సిఎం తెలిపారు. పండుగ జరుపుకోవడం కన్నా, నవ్యాంధ్రప్రదేశ్‌లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో అక్కడ గడిపానన్నారు. రాబోయే రోజుల్లో రైతుల కళ్లల్లో ఆనందం చూడాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించానన్నారు. హార్వెస్టర్ విధానాన్ని పరిశీలించానని, తాను స్వయంగా హార్వెస్టర్‌ను నడిపానన్నారు. అమెరికాలో అమలు జరుగుతున్న ఉత్తమ విధానాలను రాష్ట్రానికి తీసుకురావాలన్నదే తన కోరికన్నారు. దుబాయ్‌లో యుఎఇ హ్యాపీనెస్ అండ్ వెల్‌నెస్ శాఖ మంత్రి రౌమీతో భేటీ అయ్యానన్నారు. వివిధ దేశాల్లో అమలు చేస్తున్న విధానాలతో రాష్ట్రంలో సంతోష సూచిని పెంచేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. లండన్‌లోని ప్రజా రవాణా వ్యవస్థ అమరావతిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రెండు లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. విదేశాల్లో పురుగు మందులు, ఎరువుల వినియోగంపై నియంత్రణ ఉందని, దేశంలో ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు వాడే రాష్ట్రాల్లో ఎపి రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రంతో మాట్లాడుతున్నామని తెలిపారు. ఒక రోజు పని ఆగిపోయినా, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. 33 వేల కోట్ల రూపాయలు కేవలం పునరావాసానికే ఖర్చు అవుతుందన్నారు. రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్ష పార్టీ లక్ష్యంగా మారిందన్నారు. పొలిటికల్ మేనేజ్‌మెంట్, పరిపాలన, అభివృధ్ధి, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని, అసెంబ్లీ సమావేశాల రోజుల సంఖ్య ఉంటుందని, కేవలం రికార్డుల కోసం నిర్వహించడం సరికాదన్నారు. రాష్ట్రానికి బిజెపి ఏమి చేయడం లేదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఎవరి సమస్యలు వారికున్నాయన్నారు. రాష్ట్రానికి ఇంకా ప్యాకేజీ నిధులు రావాల్సి ఉందన్నారు. కేంద్రంతో సానుకూలంగా ఉంటూనే నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ప్రతిపక్షం అన్ని రకాలుగా నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. దుబాయ్‌లో సముద్రం మధ్యలో భవనాలు నిర్మించారని, లండన్ నగరం నది ఒడ్డున ఉందన్నారు. కానీ కృష్ణానది తీరానికి దూరంగా రాజధాని నిర్మిస్తుంటే వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నిధులు ఇస్తుందని, ఇవ్వకపోతే ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారిస్తామన్నారు.