రాష్ట్రీయం

విస్తరించిన ఈశాన్య రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 28: నైరుతి రుతుపవనాలు వేగంగా వెనక్కు తగ్గడంతో ఈశాన్య రుతుపవనాలు ఏపి, తమిళనాడులోకి చొచ్చుకు వస్తున్నాయి. ఈనెల 24న ఒడిశాలోని కొరాపుట్‌లో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు, 27 నాటికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తిగా విస్తరించినట్టు ఆంధ్రా యూనివర్శిటీ ఓష్ణోగ్రఫీ విశ్రాంత ఆచార్యులు భానుకుమార్ తెలియచేశారు. ఈ రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో రాయలసీమలో, నవంబర్ మొదటివారంలో తమిళనాడులో విస్తరిస్తాయని ఆయన చెప్పారు. నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం జరుగుతున్న ఈ సమయంలో వాతావరణం పొడిగా ఉంటుంది. అక్కడక్కడ చిన్నపాటి జల్లులు మాత్రమే కురుస్తాయని అన్నారు. అయితే, ఒక వారం రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది తుపానుగా మారేందుకు వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన తెలియచేశారు. అలాగే, నవంబర్‌లో రెండు, మూడు తుపాన్లు ఆంధ్ర తీరాన్ని తాకే అవకాశం ఉందని భానుకుమార్ వెల్లడించారు. ఇది ఇలాఉండగా గత ఏడాది రాష్ట్రంలో చలి ఎక్కువగా ఉంది. అయితే, ఈసంవత్సరం సామాన్యంగా ఉంటుందని భానుకుమార్ చెప్పారు. కాగా, ఈ సంవత్సరం ఈశాన్య రుతుపవనాల ప్రభావం వలన రాయలసీమలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల వలన రాయలసీమలో 28 శాతం అధిక వర్షం కురిసిందని, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వలన కూడా రాయలసీమకు మేలు జరుగుతుందని భానుకుమార్ తెలియచేశారు.