రాష్ట్రీయం

ఫాతిమా’ విద్యార్థులకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 28: కడప జిల్లా రామరాజుపల్లిలోని ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తాం, విద్యార్థులు అధైర్యపడొద్దు.. మరోసారి కోర్టును అభ్యర్థిచే అంశాన్ని ఢిల్లీ వెళ్లి పరిశీలిస్తామని ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. ఫాతిమా విద్యార్థులకు ఏదో విధంగా న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని కామినేని శనివారం ప్రారంభించారు. అనంతరం మీడియా మాట్లాడుతూ ఫాతిమా వైద్య కళాశాల యాజమాన్య వైఖరి వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందన్నారు. ఎంసిఐను అన్ని విధాలా అభ్యర్ధించామని, మరోసారి ఢిల్లీ వెళ్ళి న్యాయపరంగా అన్ని విషయాలను పరిశీలించి విద్యార్థులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో నర్శింగ్ సేవలు విస్తృతం చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా పనిచేసేందుకు కొత్తగా ప్రైవేటు రంగంలో నర్శింగ్ కాలేజీలకు అనుమతి కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి న్యూరో సర్జన్లను కూడా తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో శిశు మరణాల నివారణకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ప్రత్యేకంగా నియమిస్తున్నామన్నారు. వైద్యుల పరంగా ఎక్కడా ఖాళీలు లేకుండా పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించామన్నారు. రాజమహేంద్రవరం, విశాఖ, విజయవాడ ఆసుపత్రులను విస్తృతంగా అభివృద్ధి చేశామన్నారు.
ప్రజా సమస్యలపై చర్చించి విధానపరంగా వ్యవహరించాల్సిన చట్ట సభలను వదిలేసి గాల్లో తిరుగుతానని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొనడం సరికాదని, రాష్టప్రతికి లేఖ రాయడం చూస్తుంటే ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలమైనట్టుగా తనకు తానే నిరూపించుకున్నట్టుగా ఉందని మంత్రి కామినేని ఆరోపించారు. జగన్‌ను ప్రజలు ఛీకొడతారని ఆక్షేపించారు. జగన్ శుక్రవారాన్ని కోర్టు వారంగా మార్చారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పట్టిసీమను వృధా అన్న నేతలు ఇప్పుడేమి చెబుతారని ప్రశ్నించారు. రూ.1300 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించడం వల్ల ఏడాదికి రూ. 5వేల కోట్ల పంట ఆదాయం లభిస్తోందన్నారు. జగన్ ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవహరించాలి గానీ, ప్రజలు ఛీకొట్టే విధంగా వ్యవహరించకూడదన్నారు. అంతకు ముందు వైద్య శిబిరం ప్రారంభోత్సవ సభలో మంత్రి కామినేని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అనేక వైద్య సంక్షేమాలను అందజేయడం జరుగుతోందన్నారు. 13 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం 32 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు మెగా వైద్య శిబిరం నిర్వహించడం పట్ల ఎంపి మాగంటి మురళీమోహన్‌కు అభినందనలు తెలియజేస్తున్నామని, ఇటువంటి వైద్య శిబిరాల వల్ల ముందు రోగ నిర్ధారణ జరిగితే వైద్యం అందించేందుకు కృషి చేయొచ్చన్నారు. ఈ శిబిరంలో రోగ నిర్ధారణ ద్వారా అవసరమైన ఆపరేషన్లకు ప్రభుత్వం ఏభై శాతం నిధులను భరించే విధంగా కూడా కృషి చేస్తుందని చెప్పారు. మంత్రి వెంట మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎంపి మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ తదితరులు వున్నారు.