రాష్ట్రీయం

రహదార్లు.. రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట/ బత్తలపల్లి, అక్టోబర్ 28: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు చిట్టూరిపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో ఆరుగురు మహిళలు మృతిచెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల పరిధిలోని అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రెండు ఘోర ప్రమాదాల్లో పదిమంది బలైపోవడంతో ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలముకున్నాయ. వివరాల్లోకి వెళ్తే.. రావులపాలెం -అమలాపురం ప్రధాన రహదారిపై కంకర లోడుతో వెళుతున్న లారీ ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అల్లవరం మంచినీటి చెరువు గట్టు నుంచి ఆటోలో మహిళలు ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్తుండగా కొత్తపేట మండలం మోడేకుర్రు చిట్టూరివారిపాలెం వచ్చేసరికి ప్రమాదం చోటుచేసుకుంది. చీకట్ల నాగమణి (46), పిల్లా భవాని (28), పిల్లా పార్వతి (48), పేరాబత్తుల అనంతలక్ష్మి (36), పిలిమే అనంతలక్ష్మి (45), పిల్లా దుర్గ (45)లు మృతిచెందగా గరగా శిరీష, పిల్లా జగదీశ్వరి, పిల్లా వీరవెంకటలక్ష్మి, పిల్లా మాణిక్యం, పిల్లా భూలక్ష్మి, చీకట్ల అనంతలక్ష్మిలతోపాటు ఆటోడ్రైవర్ ఆకుల విజయభాస్కర్ గాయాలపాలయ్యారు. పిల్లా దుర్గ తీవ్రంగా గాయపడి అమలాపురం తరలిస్తుండగా మృతిచెందింది. గాయపడిన వారిని తొలుత అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించగా వారిలో పిల్లా దుర్గ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఘటనలో పిల్లా హర్షిణి అనే మూడేళ్ల చిన్నారి ఎటువంటి గాయాలు లేకుండా బయటపడింది. అయితే ప్రమాదంలో చిన్నారి తల్లి పిల్లా భవాని మృతిచెందింది. ప్రమాదానికి ఆటో డ్రైవర్ నిర్లక్షమే కారణంగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వివరాలు తెలిసిన వెంటనే రావులపాలెం సిఐ పెద్దిరాజు, కొత్తపేట ఎస్‌ఐ డి విజయ్‌కుమార్‌లు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
హోంమంత్రి రాజప్ప పరామర్శ
ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాశన మండలి డిప్యూటీ
ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంలు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మృతులకు రూ.5లక్షల పరిహారం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొరికి ఐదులక్షల రూపాయల చెల్లించి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకున్నారని, అధికారుల పర్యవేక్షణ కరవవుతుందని రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.
నలుగురి దుర్మరణం
అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల పరిధిలోని అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో మరో నలుగురికి గాయాలయ్యాయి. తుఫాన్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కదిరి నుంచి ప్రయాణికులతో బత్తలపల్లికి వస్తున్న తుఫాన్ వాహనం నల్లబోయినపల్లి బస్ స్టేజి వద్దకు రాగానే వెనుక టైర్ పంచరైంది. దీంతో అదుపుతప్పి రోడ్డుపక్కన పొలాల్లో ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో వాహనంలోని శంకర్(45), రమణారెడ్డి(47), బాబయ్య(22), మరో వ్యక్తి(47) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ నలుగురిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..మోడేకుర్రు చిట్టూరివారిపాలెం వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళలు