రాష్ట్రీయం

కార్పొరేటర్లకు ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ప్రతి ఇంట్లో పోగయ్యే చెత్తను తడి,పొడిగా వేర్వేరు చేసి ఆటో టిప్పర్ల సిబ్బంది అందించటంలో మెరుగైన ఫలితాలను సాధించే స్వచ్ఛ డివిజన్లకు రూ. 50లక్షల నగదు నజరానాను అందించనున్నట్లు మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం గ్రేటర్ కార్పొరేటర్లతో హోటల్ హరితప్లాజాలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డివిజన్‌లో నూటికి నూరు శాతం ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్తను వేరు చేసి అందిస్తున్నట్లు స్థానిక డిప్యూటీ కమిషనర్లు ధృవీకరించిన తర్వాతే ఈ నజరానాను అందజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశార. కార్పొరేటర్లు సెలవు రోజులైన ప్రతి శని, ఆదివారాల్లో తమ పరిధిలోని అపార్ట్‌మెంట్లు, బస్తీలను సందర్శించాలన్నారు. తమ పరిధిలో ప్రభుత్వ భూమి ఉంటే వాటి వివరాలను సంబంధిత జోనల్ కమిషనర్లకు అందజేయాలని, అలాంటి భూములకు సంబంధించి ఎలాంటి వివాదాల్లేకుంటే అక్కడ కార్పొరేటర్ కార్యాలయాలను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. చెత్త నుంచి 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను త్వరలోనే ప్రారంభం కానుందని, ప్రస్తుతం ఉన్న 2వల స్వచ్ఛ ఆటోల ట్రాలీలకు అదనంగా మరో 500 ఆటోలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ కింద జిహెచ్‌ఎంసి పరిధిలోని 20 చెరువులను మొదటి దశలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చిన్నపాటి వర్షాలకే రోడ్లు, కాలనీలు జలమయం అవటానికి కారణం నాలాలపై అక్రమ నిర్మాణాలేనని, వీటి కూల్చివేతలో జిహెచ్‌ఎంసికి కార్పొరేటర్లు సహకరించాలని ఆదేశించారు. నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు నిబంధనలను అనుసరించి సిద్దంగా ఉన్న వాంబే ఇళ్లను కేటాయిస్తామన్నారు. నగరంలోని వివిధ కాలనీలు, రోడ్లపై ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను దశలవారీగా తొలగిస్తామన్నారు. సర్కిళ్ల స్థాయిలో నిర్వహించిన సంబంధిత విభాగాల అధికారుల సమన్వయ సమావేశాలకు కార్పొరేటర్లను కూడా ఆహ్వానించాలని కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఇన్నర్ రింగురోడ్డు ఉనన 55 కిలోమీటర్ల రహదారిని వైట్‌టాప్ రోడ్డుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటు 300 కిలోమీటర్ల రోడ్డును వైట్‌టాపింగ్ రోడ్డుగా మార్చేందుకు ప్రణాళికలను సిద్దం చేశామన్నారు. మొదటి దశ మూసి పరివాహక ప్రాంతంలోని 42 కిలోమీటర్లను రూ. 1565 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రూ. 3వేల కోట్లతో ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు కింద పలు ఫ్లై ఓవర్లు, కారిడార్ల నిర్మాణం పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. దీనికి తోడు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వీలుగా ఇందిరాపార్కు నుంచి విఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇక మున్ముందు ప్రతి మూడు నెలలకోసారి కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, జలమండలి ఎండి దాన కిషోర్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు రఘునందన్‌రావు, ఎన్‌వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..శనివారం హైదరాబాద్‌లో గ్రేటర్ కార్పోరేటర్లతో సమావేశమై ప్రసంగిస్తున్న మంత్రి కెటిఆర్