రాష్ట్రీయం

వైభవంగా శ్రీవారికి పుష్పయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 28: కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 12 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అర్చకస్వాములు వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్భ్రారణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం నిర్వహించారు. చామంతి, సంపంగి, నూరువరహాలు, రోజా, గనే్నరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలి రేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు విష్ణుగాయత్రి మంత్రాన్ని జపించారు. 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో స్వామిని అర్చించారు. ఉత్సవ మూర్తులు నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి బంగారు తిరుచ్చిని అధిరోహించి రాజలాంఛనాలతో ఆనంద నిలయంలోకి ప్రవేశించడంతో శ్రీవారి పుష్పయాగం నేత్రపర్వంగా ముగిసింది. పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచసూక్తాలు, పంచ ఉపనిషత్తుల్లోని మంత్రాలను పఠించారు.