రాష్ట్రీయం

2019 ఎన్నికలే టార్గెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: వచ్చే శాసనసభ ఎన్నికలు-2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుంచి చేపట్టనున్న ప్రజాసంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఒక వైపు ప్రతి శుక్రవారం కోర్టుకుహాజరు కావాల్సిందేనంటూ సిబిఐ కోర్టు స్పష్టం చేయడం, మరో వైపు అసెంబ్లీసమావేశాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయాల మధ్య ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి ఇడుపుల పాయ నుంచి ప్రారంభమయ్యే ఈ పాత్ర దాదాపు మూడు వేల కి.మీ 125 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా కొనసాగుతుంది. 2019 మార్చి-ఏప్రిల్ నెలలో జరిగే ఈ ఎన్నికలు వైకాపాకు జీవన్మరణ సమస్య. అందుకే సర్వశక్తులు పణంగా పెట్టి చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ జనంలోకి దూసుకెళ్లాలని నిర్ణయించింది. ఏడాది కాలం నుంచి వైకాపా జగన్ పాదయాత్రపై కసరత్తు చేసింది. 21 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించి టిడిపిలో చేరినా, నంద్యాల ఉప ఎన్నికల్లో పరాజయం ఎదురైనా, బలమైన సంకల్పంతో వచ్చే ఎన్నికలను ఢీ కొనే కోణంలో జగన్ రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పాదయాత్ర ద్వారా ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబు వ్యతిరేక శక్తులను ఒక వేదికపైకి తెచ్చి వైకాపాలో చేర్చుకుని ముందుకు వెళతారా లేదా అనే అంశం కీలకంగా మారింది. ఆరునెలల పాదయాత్రలోనే జగన్ 2019 ఎన్నికల్లో టిక్కెట్లు ఎవరికి కేటాయించాలే అనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో టిడిపి, వైకాపాలే బలమైన పార్టీలుగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఉనికి నామమాత్రమే. వామపక్ష పార్టీలు ఉద్యమాలు, ధర్నాల ద్వారా ప్రభావితం చేస్తున్నా, ఎన్నికలు వచ్చే సరికి సొంతంగా పోటీచేసి నెగ్గే పరిస్థితి లేదు. ఆరు నెలల పాటు జరిగే ఈ పాదయాత్రలో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు కీలకమైనవి. పైగా బూత్ స్ధాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని వైకాపా నిర్ణయించింది. టిడిపితో పోలిస్తే ఈవిషయంలో వైకాపా బాగావెనకబడి ఉంది. ప్రతి నియోజకవర్గంలో రచ్చబండ పేరిట 30 కీలక గ్రామాల్లో ప్రత్యేక హోదాపై సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమైన సామాజికివర్గాల నేతలను కలవడంతో పాటు బూత్ స్ధాయిలో పార్టీకమిటీలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి మొదటి నాలుగు మాసాల్లో కో ఆర్డినేటర్, శాసనసభ్యుడు గడపగడపకు వెళ్లి కుటుంబ సభ్యులతో మమేకమై కార్యకర్తలను కలవాలి. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 175 నియోజకవర్గాల్లో కోటి మంది పార్టీ నేతలు కోటి మంది ప్రజలను కలుసుకునే విధంగా నిర్ణయించారు. మొదటి నాలుగు నెలలు నాలుగు అంశాల ప్రాతిపదికన పల్లె నిద్ర చేపట్టాలి. మనమంతా ఒకటే కుటుంబం, ప్రజావాణి(వాయిస్ ఆఫ్ ది పీపుల్), ఇది అందరి పార్టీ, అభ్యున్నత ఆంధ్రప్రదేశ్ వైపు (బెటర్ ఆంధ్రప్రదేశ్) అంశాలపై కార్యకర్తలు దృష్టిని సారించాలని పార్టీ అధ్యక్షుడు జగన్ నేతలను ఆదేశించారు. రచ్చబండ, పల్లె నిద్ర తర్వాత మిగిలిన రెండు నెలలో చేపట్టే కార్యక్రమాన్ని నిర్దేశిస్తారు. ఈ సారి వైకాపా ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్నికల ప్రణాళికను తయారు చేయాలని నిర్ణయించింది. పల్లె నిద్ర చేసేటప్పుడు బలహీనవర్గాల కాలనీల్లో ఉండాలని పార్టీ నేతలకు అధినేత జగన్ సూచించారు. ప్రత్యేక హోదా కోరుతో సంతకాల సేకరణ కూడా చేస్తారు. ఐదు వేలకు పైగా దారి వెంబడి సమావేశాలు, 180కుపైగా పార్టీ కార్యకర్తల సమావేశాలు, ప్రభావిత సంఘాలతో భేటీలనునిర్వహిస్తారు. 125 భారీ బహిరంగ సభల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.