రాష్ట్రీయం

శిక్షణ ముగిసింది.. ఇక ప్రజాసేవలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: నేషనల్ పోలీస్ అకాడమీలో 69వ, బ్యాచ్‌కు చెందిన 136 మంది ఐపిఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారని, ఇక ప్రజాసేవలో యువ ఐపిఎస్‌లు పాల్గొంటారని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ దూలె బర్మన్ తెలిపారు. పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా శనివారం పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మొత్తం 136 మంది ఐపిఎస్ అధికారులు శిక్షణ పొందారని వీరిలో 14మంది విదేశీయులు కాగా, 22 మంది మహిళా అధికారులున్నారు. రాయల్ భూటాన్‌కు చెందిన 5గురు, నేపాపల్ 5, మాల్దీవులకు చెందిన వారు నలుగురు ఉన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వీరి పాసింగ్ ఔట్ పరేడ్ ఈనెల 30న నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని డైరెకర్టర్ బర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రొబెషనరీ ఐపిఎస్ అధికారులు సాధించిన ట్రోఫీలను కేంద్ర మంత్రి విజేతలకు అందజేస్తారన్నారు.
శిక్షణ పొందిన ఐపిఎస్ అధికారుల్లో తెలంగాణ రాష్ట్రానికి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌కుకు నలుగురు ఐపిఎస్ అధికారులను కేటాయించడం జరిగిందని, మొత్తం 136 మంది ప్రొబెషనరీ అధికారుల్లో రెండు రాష్ట్రాలకు ఏడుగురిని మాత్రమే కేటాయించగా, అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు 15మంది అధికారులను కేటాయించారు. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణకు అవసరానికి తగ్గట్టుగా అధికారులను కేటాయించకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ క్యాడర్‌కు పి సాయిచైతన్య, రాజేష్ చంద్ర, శరత్‌చంద్ర పవార్, అదేవిధంగా ఆంధ్రా క్యాడర్‌కు చెందిన సతీష్‌కుమార్, సుమిత్ సునీల్, వకుల్ జిందాల్, రిషిత్‌రెడ్డిలను కేటాయించారు. యువ ఐపిఎస్ అధికారుల్లో ఎక్కువ మంది ఇంజనీర్లు 75, ఆర్ట్స్ 7, సైన్స్ 6, ఎంబిబిఎస్ 3, ఎంబిఏ 1, న్యాయశాస్త్రం 4, ఎంఫిల్ 3, ఇతరులు 21 మంది అధికారులున్నారు.
ట్రోఫీ విజేతలు వీరే
ప్రధాన మంత్రి బ్యాటన్, హోంమంత్రి రివాల్వర్ బెస్ట్ ఆల్‌రౌండర్ ఐపిఎస్ ప్రొబేషనర్ సమీర్ అస్లాం షేక్ (మహరాష్ట్ర), ఐపిఎస్ అసోసియేషన్ స్వార్డ్ ఆఫ్ హానర్, బెస్ట్ ఔట్ డోర్ ప్రొబెషనర్ రాజేశ్ పురి (నేపాల్ పోలీస్) 1973వ, బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్స్ బెస్ట్ ఆల్‌రౌండర్ లేడి ఐపిఎస్ ఆఫీసర్ అమృత దూహన్ (రాజస్థాన్), 1958వ, బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్స్ ట్రోఫీ బెస్ట్ ఔట్ డోర్ లేడి ఆఫీసర్ అమృత దూహన్ (రాజస్థాన్), మెహతా కప్ ఫర్ స్టడీస్ సుమిత్ సునీల్ గరుడ్ (ఆంధ్రప్రదేశ్), భువనానంద మిశ్రా మెమోరియర్ ట్రోఫీ అమృతా దూహన్ (రాజస్థాన్), టోంక్ కప్ ఫర్ ఈక్విటేషన్ ఆర్ కృష్ణరాజ్ (తమిళనాడు), ఎస్‌ఆర్‌బి కప్ ఫర్ డ్రిల్, శివానంద సర్వే (మణిపూర్), జైపూర్ కప్ ఫర్ పిటి గిర్పో (రాయల్ భూటాన్), బెస్ట్ ట్రోఫీ ఫర్ ప్రొఫిషియన్సి ఔట్‌డోర్ సబ్జెక్ట్ రాజేశ్ రాజ్‌పురి (నేపాల్ పోలీస్) కైవసం చేసుకున్నవారిలో ఉన్నారు.
సమీర్ అస్లాం షేక్: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుకున్న సమీర్ అస్లాం మహరాష్టల్రోని థానె జిల్లాకు చెందిన అధికారి. కాగా చిన్నతనం నుంచే సమాజ మార్పునకు కృషి చేయాలనే తపన ఉంది. అది కాస్త ఐపిఎస్‌తో తన వంతు కృషి చేద్దామనుకుని సంకల్పించాను. ప్రజల్లో పాజిటివ్‌గా మార్పు తెచ్చే దిశగా ప్రయత్నిస్తాను.
అమృత దుహాన్: దేశంలో చాలా మంది పేదలు ఉన్నారు. సరైన న్యాయం దొరకక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పేదలకు సాయపడాలనే తన సంకల్పం నెరవేరింది. ఐపిఎస్ అధికారిగా తన వంతు ప్రయత్నం చేస్తాను.

చిత్రాలు.. పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల
సమావేశంలో మాట్లాడుతున్న అకాడమీ డైరెక్టర్ దూలె బర్మన్, డిప్యూటీ డైరెక్టర్ తదితరులు
*శిక్షణ పొందిన ఐపిఎస్‌లు