రాష్ట్రీయం

బాబు మాట బేఖాతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 29: వివిధ ప్రభుత్వ శాఖల నుంచి విడుదలయ్యే ప్రకటనలన్నీ ఒకే గొడుకు కిందికి తేవడం ద్వారా జవాబుదారీతనం పెంచాలన్న ముఖ్యమంత్రి సదుద్దేశం నెరవేరని పరిస్థితి నెలకొంది. సిఎం ఆదేశాలను మంత్రులు, అధికారులు బేఖాతరు చేయడంతో లక్ష్యానికి గండిపడింది. సమాచార శాఖ ద్వారానే అన్ని శాఖలు ప్రకటనలు ఇవ్వాలంటూ 45 రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వు చివరకు చెల్లని కాగితమైంది. ఇప్పటివరకూ వికేంద్రీకరణ ప్రకటనల విధానంతో అనధికార ఆదాయం సమకూర్చుకుంటున్న కొన్ని శాఖల అధికారులు, మరికొందరు మంత్రులు ఈ కొత్త విధానానికి మోకాలడ్డుతున్నట్లు సమాచారం. ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు సమాచార శాఖ ద్వారానే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం గత నెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. 1994లోనే దీనికి సంబంధించి ఉత్తర్వులున్నా, వివిధ కారణాల వల్ల ఆ విధానం అమల్లో లేకుండా పోయంది. రాష్ట్ర విభజనతో 2015 ఫిబ్రవరిలో మరోసారి ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఈ విధానం అమలు చేసేందుకు ఏ ప్రభుత్వ సంస్థ, శాఖ ముందుకు రాకపోవడంతో మరోసారి తాజాగా గత నెలలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసే భూసేకరణ సహా అన్నిరకాల ప్రకటనలను సమాచార శాఖ ద్వారానే జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. సమాచార శాఖ ద్వారా ప్రకటనల జారీ ప్రక్రియతో సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఆయా శాఖలు ఒక లైజాన్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ప్రకటనకు సంబంధించి ఆర్టువర్కు ఖరారైతే, దానిని అడ్వర్జైట్‌మెంట్ ఏజెన్సీ లేదా థర్డ్ పార్టీ ద్వారా కాకుండా నేరుగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఆలస్యంగా ఆర్టువర్కు అందచేస్తే, జరిగే జాప్యానికి సమాచార శాఖ బాధ్యత వహించదు. ప్రకటనలో ఫాంట్ సైజు, తదితర అంశాలపైనా మార్గదర్శకాలను జారీ
చేసింది. సమాచార శాఖ ద్వారా జారీకాని ప్రకటనల బిల్లులను చెల్లించవద్దంటూ కూడా జిల్లా ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయ. అయినా ఇప్పటివరకూ ఈ విధానాన్ని ప్రభుత్వ శాఖలు అమలుచేయని దుస్థితి నెలకొంది. ముఖ్యంగా తరచూ నేరుగా ప్రకటనలిచ్చే సాంఘిక సంక్షేమ, ఇరిగేషన్, రెవిన్యూ, హెల్త్, బీసీ, ట్రాన్స్‌పోర్టు, టూరిజం వంటి కీలక శాఖలు ఈ ఉత్తర్వును అమలు చేసేందుకు విముఖత ప్రదర్శిస్తున్నాయి. దానికి ‘ఇతర మార్గాలు’ మూసుకుపోతాయన్న భయమే కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పీఆర్వోల వేతనాల్లోనూ గందరగోళమే!
ఇదిలాఉండగా మంత్రుల వద్ద పనిచేస్తున్న ఎంఎల్‌వోలు, పీఆర్వోల వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉండటంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు జర్నలిస్టులుగా పనిచేసిన 21 మందిని మంత్రుల వద్ద ఎంఎల్‌వో, పీఆర్వోలుగా నియమించారు. అయితే ఎంఎల్‌వోలకు కేవలం రూ. 20వేలు జీతం ఇస్తుండగా, అదే పనిచేసే కొందరు పీఆర్వోలకు మాత్రం రూ. 50, 75 వేలు ఇస్తుండటంపై అసంతృప్తి వ్యక్తమయింది. దాంతో ఎంఎల్‌వోల వేతనాలను రూ. 30వేలకు పెంచుతూ ప్రతిపాదించినప్పటికీ ఇప్పటివరకూ ఆర్థిక శాఖ ఆమోదించలేదు. గతంలో సమాచార శాఖ ఓ పీఆర్వోకు రూ. 75వేలు ఇచ్చిన వైనంపై ఎంఎల్‌వోల నుంచి ఫిర్యాదులు రావడంతో మళ్లీ దాన్ని రూ. 20వేలకు కుదించాల్సి వచ్చింది. అదేవిధంగా సీఎంవోలో పనిచేసే కొందరు పీఆర్వోలకు రూ. 50వేల నుంచి లక్షన్నర వరకూ ఇస్తుండగా, సమాచార శాఖలో అదే పనిచేసే మరికొందరికి మాత్రం కేవలం రూ. 40వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇక రియల్‌టైం గవర్నెన్స్ బృందంలో పనిచేసే వారికి రూ. 50వేల నుంచి లక్షన్నర వరకూ ఇస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. అయితే ప్రభుత్వ ప్రచారం కోసం నాలుగైదు వ్యవస్థలు పనిచేస్తున్నప్పటికీ వారికి బ్యాకప్, టెక్నికల్ సపోర్టు అంతా మళ్లీ సమాచార శాఖ సాంకేతిక, ఇంజనీరింగ్ విభాగమే సమకూరుస్తుండటం ప్రస్తావనార్హం. ఆ నిధులేవో నేరుగా సమాచార శాఖకే బదలాయిస్తే ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు, కోట్ల రూపాయల డబ్బు ఆదా అయి నాణ్యత కూడా పెరుగుతుంది. తెలంగాణతో పోలిస్తే ఏపి సమాచార శాఖ బడ్జెట్ అత్యల్పం. కానీ ఆ శాఖపై పెత్తనం చేసే ప్రముఖుల సంఖ్య మాత్రం అనంతం. సరిపడా సిబ్బంది లేకపోయినా ఉన్న వనరులతోనే పనిచేస్తున్న సమాచార శాఖపై సిఎం నేరుగా దృష్టి సారించాల్సి ఉంది. ఒకే తరహా పనిచేస్తున్న వారి మధ్య ఈ వ్యత్యాసాలు, పక్షపాతమేమిటన్న అసంతృప్తి అటు ఎంఎంల్‌వోల నుంచీ వ్యక్తమవుతోంది. పౌర సంబంధాలు నిర్వహించే వీరికి కూడా ఏకీకృత వేతన వ్యవస్థను అమలు చేయాలన్న సూచన వ్యక్తమవుతోంది.