రాష్ట్రీయం

బరితెగించిన ఎర్రదొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు/ చంద్రగిరి, అక్టోబర్ 29: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎర్రచందనం దొంగలు బరితెగించారు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని మర్రిపాడు పోలీస్ స్టేషన్ మీదుగా నెల్లూరు- ముంబయి రహదారి మీదుగా ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. తరలిపోతున్న ఎర్రచందనం దుంగల వాహనాన్ని స్థానిక ఎస్సై అబ్దుల్ రజాక్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రజాక్ ప్రయత్నానికి సిఐ ఖాజావలి సహకరించడంతో ఎట్టకేలకు స్మగ్లర్లు ఉన్న వాహనాన్ని ఆపగలిగారు. అయితే పోలీసులు స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన సందర్భంలో పలువురు నిందితులు కర్రలు, రాళ్లతో పోలీసులపై ఎదురుదాడికి దిగుతూ పరారయ్యారు. అదృశ్యమైన స్మగ్లర్ల వేటకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ దాడుల్లో అంతఃరాష్ట్ర, స్థానిక స్మగ్లర్లు 19 మంది అరెస్ట్‌కావడంతో సహా 81 ఎర్రచందనం దుంగలు, ఒక 407 వాహనంతో, మహేంద్ర మ్యాక్స్ పికప్ వాహనం, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన 81 ఎర్రచందన దుంగల బరువు 905 కిలోల వరకు ఉందని నిర్ధారించారు. మొత్తం పట్టుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాల
విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. వీటితో సహా నిందితుల నుంచి పది మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనపరచుకున్నారు. అరెస్టైన వారిలో తమిళనాడు పొనే్నరి అంతఃరాష్ట్ర స్మగ్లర్లు ఇరువురు, కడప జిల్లాకు చెందిన స్మగ్లర్లు ఇరువురు ఉన్నారు. మిగిలిన నిందితులు నెల్లూరుజిల్లాలోని వెంకటగిరి, డక్కిలి ప్రాంతాలకు చెందిన వారున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం వద్ద 20 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నట్లు ఆర్‌ఎస్‌ఐ వాసు తెలిపారు. శ్రీవారిమెట్టు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా తమిళంలో మాట్లాడుతున్న కొంతమంది ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ తారసపడ్డారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది ఎదురుపడగానే దుంగలను వదిలి చీకట్లో పారిపోయారు. దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.