రాష్ట్రీయం

మిషన్ సూపర్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: మిషన్ కాకతీయ అమలు చేయడం వల్ల రాష్ట్రంలో 51.5 శాతం సాగు వీస్తిర్ణం పెరిగింది. అలాగే భూ గర్భజలాల మట్టం పెరుగుదల, ఎండిపోయిన బోర్ల రీచార్జి, 39 శాతం చేపల ఉత్పత్తి పెరిగింది. మిషన్ కాకతీయ ప్రభావంపై నాబార్డుకు చెందిన న్యాబ్కమ్ జరిపిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. న్యాబ్కమ్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సందర్భంగా నివేదికలో వెల్లడయిన అంశాలను మంత్రి హరీశ్‌రావు ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఖరీఫ్‌లో వర్షపాతం ఆశాజనకంగా లేకపోయినా మిషన్ కాకతీయ అమలు వల్ల 2016 సంవత్సరంలో 51.5శాతం సాగు విస్థీర్ణం పెరిగిందని తెలిపారు.ఈ పెరుగుదల రబీ సీజన్‌లో మరింత ఎక్కువగా నమోదు అయిందని పేర్కొన్నారు.గత ఏడాది 2016లో సెప్టెంబర్ మూడవ వారంలో కురిసిన వర్షాలకు చెరువులు నిండాయి.ఈ నిష్పత్తిలో రాష్ట్రంలో చెరువుల కింద సుమారు 10.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడిందన్నారు. ఖరీఫ్,రబీ రెండు పంట సీజన్లను కలిపిపే సాగు విస్తీర్ణం 45.6 శాతం పెరిగిందన్నారు. జిల్లాల వారీగా చూస్తే అతి తక్కువగా నల్లగొండలో 22.5 శాతం, అధికంగా కరీంనగర్‌లో62.5 శాతం పెరిగిందన్నారు. అలాగే చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాల మట్టం రెండు శాతం పెరిగిందని ఫలితంగా ఎండిపోయిన గొట్టపు బావులు 17 శాతం రీచార్జి అయ్యాయని మంత్రి హరీశ్‌రావు వివరించారు. చెరువులలో పూడికతీత వల్ల ఎరువుల వాడకం తగ్గడంతో రైతులకు పెట్టుబడి భారం తగ్గిందన్నారు. చెరువుల పునరుద్ధరణ వల్ల పుష్కలంగా నీరు ఉండటం వల్ల 39 శాతం చేపల ఉత్పత్తి పెరిగిందని మంత్రి వివరించారు. ఇంకా మిషన్ కాకతీయపై గుజరాత్‌కు చెందిన ‘ఇర్మా’ యూనివర్సిటీ ఆఫ్ చికాగో, మిచిగాన్ యూనివర్సిటీలు కూడా అధ్యయనం చేస్తున్నాయన్నాయని మంత్రి తెలిపారు.

చిత్రం..మిషన్ కాకతీయపై న్యాబ్‌కామ్ అధ్యయన సారాంశాన్ని వెల్లడిస్తున్న మంత్రి హరీశ్‌రావు