రాష్ట్రీయం

నిర్మాత అట్లూరి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: ప్రముఖ సినీ నిర్మాత, కమ్యూనిస్టు ఉద్యమకారుడు అట్లూరి పూర్ణ చంద్రరావు(92) కన్నుమూశారు. గత కొంత కాలం గా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కమలానగర్‌లోని తన నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ప్రముఖ నటి సావిత్రితో దర్శకత్వం చేయించి ‘మాతృదేవత’ చిత్రాన్ని తీశారాయన. పూర్ణ చంద్రరావుకు భార్య మరుద్వతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణా జిల్లా చవుటపల్లి గ్రామంలో మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అట్లూరి గోరా నాస్తికోద్యమ ప్రభావంతో కమ్యూనిస్టుగా మారారు. కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ అనేక సార్లు అరెస్టయి జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత ఓ కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరిన ఆయన నవయుగ డిస్ట్రిబ్యూటర్స్‌లో రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. ఈ క్రమంలో గుంతకల్లు నవయుగ బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఇక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలోనే దర్శకుడు తాతినేని ప్రకాశరావు వద్ద సహాయకుడిగా పని చేసేందుకు మద్రాసు వెళ్లారు. ఈ క్రమంలో దర్శకులు విఠలాచార్య, పి. పుల్లయ్య దగ్గర పనిచేశారు. ‘దేవదాసు’ నిర్మాత డి.ఎల్ నారాయణ, ఎస్. భావనారాయణ ప్రోత్సాహంతో ప్రొడక్షన్ రంగంలోకి దిగారు. విజయవాడ నవభారత్ బుక్‌హౌస్ ప్రకాశరావుని భాగస్వామిగా చేసుకుని ‘అగ్గిమీద గుగ్గిలం’ సినిమాతో నిర్మాతగా అవతారమెత్తారు. ఆ తర్వాత ‘ఉక్కు పిడుగు’, ‘రౌడీరాణి’, ‘పాపం పసివాడు’, ‘తండ్రీ కొడుకులు’, ‘స్ర్తి’, ‘కలవారి కోడలు’, ‘ఆడపడుచు’, ‘యమగోల’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషా చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. 1955 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత నెమ్మదిగా కమ్యూనిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన హైదరాబాద్‌లో కూల్‌డ్రింక్ షాపుతో జీవనయానం ప్రారంభించారు. బంధువులైన కె. ప్రత్యగాత్మ, కె. హేమాంబరధరరావులు అప్పటికే సినీ దర్శకులుగా పేరు తెచ్చుకోవడంతో క్రమంగా తానూ సినిమాలవైపు ఆకర్షితులయ్యారు. చిన్నప్పటి నుంచీ శాంతారాం, గూడవల్లి రామబ్రహ్మం లాంటి వారి చిత్రాలను అభిమానించిన పూర్ణ చంద్రరావు తన సినిమాల్లో సామాజిక అంశాలకే ప్రాధాన్యమిచ్చారు. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నా, వ్యాపారపరంగా రాణించలేకపోయారు. పూర్ణ చంద్రరావు మృతదేహం వద్ద సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. కమ్యూనిస్టు పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అట్లూరి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, కమ్యూనిస్టు నాయకులు సంతాపం తెలిపారు.