రాష్ట్రీయం

శబరిమలకు 156 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: రానున్న శబరిమల యాత్ర సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ గమ్య స్థానాల నుంచి శబరిమలకు 156 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లన్నింటికి ఈ నెల 30 నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్‌ను చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఈ రైళ్లన్నీ స్పెషల్ ఫేర్ తత్కాల్ సర్వీస్‌గా నడుపుబడుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్-కొల్లాం-హైదరాబాద్ మధ్య 24 సర్వీసులు నడుపుతుండగా, సుక్లేహళ్లి, రాయచూర్ గుంతకల్లు మీదుగా హైదరాబాద్-కొల్లాం-హైదరాబాద్ మధ్య మరో 22 సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లు నవంబర్ 17 నుంచి నడుస్తాయని స్పష్టం చేసింది. నవంబర్ 13 నుంచి నిజామాబాద్-కొల్లాం-నిజామాబాద్ మధ్య 4 సర్వీసులు, నవంబర్ 10 నుంచి కాకినాడ టౌన్-కొల్లాం-కాకినాడ టౌన్ మధ్య 46 సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపింది. వయా నడికుడి, గుంటూరు, రేణిగుంట మీదుగా డిసెంబర్ 12 నుంచి హైదరాబాద్-కొల్లాం-హైదరాబాద్ మధ్య 10 సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే స్పష్టం చేసింది. నిజామాబాద్-కొల్లాం- నిజామాబాద్‌కు వయా మల్కాజ్‌గిరి, కాచిగూడ, దోన్ మీదుగా ఆరు సర్వీసులు, కరీంనగర్-కొల్లాం మధ్య వయా వరంగల్,విజయవాడ, రేణిగుంట మీదుగా ఒక సర్వీస్‌ను డిసెంబర్ 29న, కాచిగూడ-కొల్లాం-కాచిగూడ మధ్య రెండు సర్వీసులను జనవరి 1న, 3న నడుపుతున్నట్లు తెలిపింది. డిసెంబర్ 29, 30 తేదీల్లో, డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో నర్సాపూర్-కొల్లాం-నర్సాపూర్ మధ్య నాలుగు సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే వెల్లడించింది. మచిలీపట్నం-కొల్లాం-మచిలీపట్నం మధ్య ఆరు సర్వీసులను డిసెంబర్ 10, 16, 19 తేదీల్లో, డిసెంబర్ 9, 15, 18 తేదీల్లో నడుపుతున్నట్లు తెలిపింది. విజయవాడ-కొల్లాం-విజయవాడ మధ్య ఆరు సర్వీసులు, ఔరంగాబాద్-కొల్లాం మధ్య రెండు సర్వీసులు, అకోల-కొల్లాం మధ్య ఒక సర్వీస్ నడుపుతున్నట్లు స్పష్టం చేసింది. ఆదిలాబాద్-కొల్లాం మధ్య ఒక సర్వీస్, సిర్పూర్-కాగజ్‌నగర్ మధ్య రెండు సర్వీస్, కొల్లాం-సికింద్రాబాద్ మధ్య 3, మచిలీపట్నం-కొల్లాం-మచిలీపట్నం మధ్య నాలుగు సర్వీసులను నడుపుతున్నట్లు రైల్వే పేర్కొంది.