రాష్ట్రీయం

సైన్స్ కాంగ్రెస్‌లో 125 ప్రాజెక్టుల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్-రాష్టస్థ్రాయి ఉత్సవంలో 125 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. హయత్‌నగర్‌లోని క్యాండర్ శ్రైన్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవానికి తెలంగాణలోని వేర్వేరు జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. నేషనల్ అకడమిక్ కమిటీ సభ్యురాలు గీతాస్వామినాథన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణం, ప్రకృతివనరులు, గ్లోబల్‌వార్మింగ్, వాతావరణ మార్పులు, కాలుష్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు సంబంధించి విద్యార్థులు ప్రాజెక్టులను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమంగా ఎంపికయ్యే 13 ప్రాజెక్టులను అహమ్మదాబాద్ (గుజరాత్) లో 2017 డిసెంబర్ 27 నుండి 31 వరకు జరిగే జాతీయ స్థాయి సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శిస్తారని తెలంగాణ రాష్ట్ర ఇఎఫ్‌ఎస్ అండ్ టి శాఖ జాయింట్ సెక్రెటరీ జి. కృష్ణవేణి తెలిపారు.