ఆంధ్రప్రదేశ్‌

కంచ ఐలయ్యను అరెస్టు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్న కంచ ఐలయ్యను వెంటనే అరెస్టు చేయాలని ఆర్య వైశ్య మహాసభ డిమాండ్ చేసింది. ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన ‘కోమటోళ్లు- సామాజిక స్మగ్లర్లు’ పుస్తకంపై వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ పుస్తకాన్ని నిషేధించాలంటూ ఢిల్లీలోని ఏపీ-తెలంగాణ భవన్ వద్ద ఆర్య వైశ్య మహాసభ ఆదివారం ధర్నా నిర్వహించింది. ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం కోమట్లు సమాజంలో సేవకులే గానీ, స్మగ్లర్లు ఎవరూ లేరన్న విషయాన్ని కంచె ఐలయ్య గుర్తించాలని పేర్కొన్నారు. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాస్తే, అది భావప్రకటన ఎలా అవుతుంతని ఆయన ప్రశ్నించారు. కులాల, మతాల మధ్య చిచ్చుపెడుతున్న కంచె ఐలయ్యను వెంటనే అరెస్టు చేయాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.