రాష్ట్రీయం

తెలంగాణ టిడిపిలో రేవంత్ దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ తెలుగు దేశం పార్టీలో రేవంత్ రెడ్డి దుమారం కొనసాగుతున్నది. రేవంత్ వెనకాలే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలూ వెళ్ళేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సోమవారం ఉద యం నెక్లెస్ రోడ్డులోని జల విహార్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. కాగా జల విహార్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రేవంత్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జల విహార్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ప్రభుత్వం ఇప్పటి నుంచే వేధించడం ప్రారంభించిందని ఆయన అనుచరులు విమర్శిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే లేదా ముఖ్యమైన సీనియర్ నాయకుడైనా రేవంత్ వెంట వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది. పార్టీనే అంటి పెట్టుకుని ఉందామనుకున్న కొంత మంది నేతల గుండేలు గుభేలుమంటున్నాయి. శాసనసభ్యత్వానికీ రాజీనామా చేసిన రేవంత్ తన గన్‌మెన్లనూ వెనక్కి పంపించేశారు. ఈ నెల 31న ఢిల్లీలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో చేరనున్న సంగతిని రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. ఇలాఉండగా రేవంత్‌పై టి.టి డిపి అధ్యక్షుడు ఎల్. రమణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను వెన్నుపోటుదారుడని దుయ్యబట్టారు. నాడు ఎన్టీఆర్‌కు పార్టీలో ఉన్న వ్యక్తే వెన్నుపోటు పొడిచినట్లు ఇప్పుడు రేవంత్ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని అన్నారు. యువకుడైన రేవంత్‌ను తాను పార్టీలో అన్ని విధాలా ప్రోత్సహించానని ఆయన తెలిపారు.