రాష్ట్రీయం

56 రైళ్ల వేళల్లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 29: రైల్వేబోర్డు ఆదేశాల మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నవంబర్ 1నుంచి రైళ్ల ప్రయాణ వేళల్లో భారీ మార్పులు చేపట్టింది. 56 రైళ్లకు సంబంధించి 36 ఎక్స్‌ప్రెస్ రైళ్లుండగా, మరో 19 లోకల్ పాసింజర్ రైళ్లున్నాయి. ఇప్పటి వరకు అమలయ్యే వేళల్లో మార్పులు చేస్తూ వీటిని షెడ్యూల్ కంటే ముందుగా బయలుదేరేలా నిర్ణయం తీసుకున్నారు. జగదల్‌పూర్- దుర్గ్ (18212) ఎక్స్‌ప్రెస్ 13.05గంటలకు బయలుదేరాల్సి ఉండగా, నవంబర్ 1నుంచి మధ్యాహ్నం 12.35కే జగదల్‌పూర్‌లో బయలుదేరనుంది. జగదల్‌పూర్, రాయగడల మధ్య కూడా దీన్ని కాస్త ముందుగా నడపనున్నారు. అలాగే జగదల్- భువనేశ్వర్ (18448) హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్, జనఘర్‌రోడ్డు- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (18438), భువనేశ్వర్- న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్ (12281), భువనేశ్వర్- సికింద్రాబాద్ (17015) విశాఖ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- సాయినగర్ (18503) షిర్డీ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ (22847), విశాఖపట్నం- కోర్బా ఎక్స్‌ప్రెస్ (18518), జగదల్‌పూర్- హౌరా సమలేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (180006)లు కాస్త ముందుగా గమ్యస్థానాల నుంచి బయలుదేరుతాయి. అలాగే వీటితోపాటు అమృత్‌సర్ (18508) హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్, సూరత్- పూరి ఎక్స్‌ప్రెస్ (12993), అజమర్- పూరి ఎక్స్‌ప్రెస్ (18422), ఎర్నాకులం- హటియా (22838) ఎక్స్‌ప్రెస్, బలంగీర్- భువనేశ్వర్ (12894) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ల వేళ్ళల్లో మార్పులు చేస్తూ రైల్వేబోర్డు జారీ చేసిన ఆదేశాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అమలు చేయనుంది. ఇవన్నీ షెడ్యూల్‌కంటే కాస్తంత ముందుగానే బయలుదేరుతాయని జోన్ అధికారులు తెలిపారు. వీటితోపాటు మరికొన్ని లోకల్ పాసింజర్ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ సమయాలకంటే ముందుగానే బయలుదేరనున్నాయి. విశాఖపట్నం- రాయ్‌పూర్ పాసింజర్ (58528), విశాఖపట్నం- కిరండల్ పాసింజర్ (58501), కిరండల్- విశాఖపట్నం పాసింజర్ (58502), రాయగడ- విజయవాడ పాసింజర్ (57272), విశాఖపట్నం- మచిలీపట్నం/నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (57230), పలాస- విశాఖపట్నం పాసింజర్ (58525), సంబల్‌పూర్- ఝార్స్‌గుడ పాసింజర్ (58136) రైళ్లు గమ్యస్థానాల నుంచి కాస్తంత ముందుగా బయలుదేరుతాయి. భువనేశ్వర్- కృష్టారాజపురం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (హమ్సాపూర్), హౌరా- విజయవాడల మధ్య ఇప్పటికే నడుస్తుంది. ప్రయాణికులు తమకు అవసరమైన సహాయం కోసం హెల్ఫ్‌లైన్ నెంబర్ 139ను వినియోగించుకోవచ్చని రైల్వే అధికారి ఒకరు విజ్ఞప్తి చేశారు.