రాష్ట్రీయం

త్వరలో జాతీయ లిటిగేషన్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తేవడంలో భాగంగా జాతీయ లిటిగేషన్ విధానానికి కేంద్రం తుది మెరుగులు దిద్దుతోంది. ఫిబ్రవరి రెండవ వారంలో దేశంలోని అన్ని రాష్ట్రాల హోం, న్యాయ శాఖల మంత్రుల సదస్సులో లిటిగేషన్ విధానాన్ని ఖరారు చేయనున్నారు. ఈ సదస్సుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మంత్రులను ఆహ్వానించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయఫలాలను అందించాలనే ఉద్దేశ్యంతో లిటిగేషన్ విధానాన్ని కేంద్రం రూపొందిస్తోంది. సుప్రీంకోర్టులో 61300 కేసులు, వివిధ హైకోర్టుల్లో 44,790,23 కేసులు, దిగువ స్ధాయి కోర్టుల్లో 2,73,60,814 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం పాత్ర ఉండే కేసులు ఎక్కువ. దేశంలోని కోర్టు కేసుల్లో పెద్ద లిటిగెంట్‌గా ప్రభుత్వం ఉంది. న్యాయ వ్యవస్థలో తగినన్ని వౌలిక సదుపాయాలు లేకపోవడం, జడ్జిల సంఖ్య తక్కువగా ఉండడం, పోస్టుల ఖాళీ తదితరమైన కారణాల వల్ల ప్రభుత్వపరమైన లిటిగేషన్ కేసులు పేరుకుపోతున్నాయి. ఈ కేసులు పరిష్కారం కావాలంటే కనీసం 15 ఏళ్ల సమయం పడుతుంది. ఆర్థిక ప్రయోజనాల కోసం కోర్టులను ఆశ్రయించే కేసుల్లో, ఆ ప్రయోజనాలకంటే కోర్టుకు అయ్యే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. పదోన్నతులు, వేతనాలు, పెన్షన్ల కేసుల్లో ప్రభుత్వం లిటిగెంట్‌గా ఉంటోంది. ప్రతి మంత్రిత్వ శాఖకు నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తారు. కోర్టుకు వెళ్లడం, లేదా న్యాయ అంశాల్లో ఈ నోడల్ ఆఫీసర్ నిర్ణయం ఫైనల్‌గా భావించాలి. జాతీయ, రాష్ట్ర రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పై అనేక కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉంటున్నాయి. ఫిబ్రవరిలో జరిగే జాతీయ లిటిగేషన్ విధానంపై సదస్సులో పది సూత్రాలను ప్రతిపాదించనున్నారు. ఈ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆమోదం తెలిపితే, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో జాతీయ లిటిగేషన్ విధానంపై చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు.