రాష్ట్రీయం

ఎమ్మెల్యే ఆళ్ల భిక్షాటన భూ సమీకరణకు నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 29: రాష్ట్రప్రభుత్వం బలవంతపు భూసమీకరణను తక్షణం నిలిపివేయాలంటూ మంగళగిరి వైస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) శుక్రవారం ఉండవల్లి సెంటర్‌లో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత విధానాలవల్ల రాజధాని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గతంలో గ్రామాల్లో రహదారులు రావని ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం మాట్లాడకపోవడం అభ్యంతరకరమన్నారు.
ఇప్పటికైనా రహదారులు రావని స్పష్టంచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్రా సిఎం చంద్రబాబు వ్యవహారం నచ్చకనే సహకరించడం లేదని వ్యాఖ్యానించడం ప్రజలు గుర్తించాల్సిన అంశమన్నారు. దేశప్రధాని నరేంద్రమోదీ సిఎం చంద్రబాబును నమ్మకపోవడం వలనే శంకుస్థాపనకు హాజరై నీరు-మట్టి ఇచ్చారని విమర్శించారు.

ఉండవల్లిలో భిక్షాటన చేస్తున్న
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి