రాష్ట్రీయం

మతోన్మాద శక్తుల ఆటలు సాగనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 29: విద్యా వ్యవస్థలో మతోన్మాద శక్తులు చొరబడకుండా ప్రగతిశీల పోరాటాలతో విద్యార్థి సంఘాలు అడ్డుకట్ట వేయాలని, దేశంలో లౌకిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు పాలకపక్ష బిజెపి అనుబంధ శక్తులు కుట్ర పన్నుతున్నాయని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌కుమార్ విరుచుకుపడ్డారు. నగరంలో మూడు రోజుల పాటు జరిగే ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర 46వ మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భారీ ర్యాలీ జరిగింది. అనంతరం గాంధీనగర్ జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభల విశ్వజిత్ కుమార్ మాట్లాడారు. బిజెపి దేశంలో హిందూయిజాన్ని ప్రయోగిస్తూ ప్రజల మధ్య సమైక్యతకు భంగం సృష్టించేందుకు కుట్రపన్నుతోందన్నారు. మతోన్మాద శక్తులు, కాషాయికారణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు విద్యార్థులు నడుంబిగించాలంటూ పిలుపునిచ్చారు. స్వాతంత్య్రోద్యమం ఆవిర్భావం నుంచి దేశంలో ఎఐఎస్‌ఎఫ్ క్రియాశీలక పాత్ర పోషించడమేగాక సమసమాజ స్థాపనకు, దేశంలో లౌకికవాద నిర్మాణానికి ప్రధాన భూమిక వ్యవహరించిందన్నారు. భగత్‌సింగ్, డాక్టర్ అంబేద్కర్, వివేకానంద వంటి మహానీయుల బాటలో పయనిస్తూ విద్యార్థుల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నదన్నారు. ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం అనూహ్యంగా పెరిగిపోతోందన్నారు. కాషాయికరణకు మద్ధతు పలికిన వారినే వైస్ ఛాన్సలర్‌లుగా మోదీ ప్రభుత్వం నియమిస్తోందన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యే ఇందుకు కారణమన్నారు. రోహిత్ బలవన్మరణం వృథా కాబోదని, మతోన్మాద శక్తులను తరిమి కొట్టేందుకు ఈ సంఘటన స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. రోహిత్ ఆత్మహత్యలో విసి నుంచి పలువురు కేంద్ర మంత్రుల పాత్ర ఉందంటూ వారిని సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తున్నాయని అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా దళిత మైనార్టీ అభ్యుదయ రచయితలపై దాడులు పెరిగాయని చివరకు తినే ఆహారంలోనూ నిషేధం విధిస్తూ దిగజారుడుగా వ్యవహరిస్తోందన్నారు.

4 కోట్ల ఎర్రచందనం దుంగలు పట్టివేత
చంద్రగిరి, జనవరి 29 : చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని నాగపట్ల అడవిలో సుమారు 4 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్సు సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ గోపినాధ్ జెట్టి తెలిపారు. చంద్రగిరి పోలీస్టేషన్లో అర్జన్ ఎస్పీ గోపీనాధ్ జెట్టి స్టేషన్ రికార్డులను తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం రాత్రి టాస్క్‌పోర్స్ సిబ్బంది రాగిమాను గుంట వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం దుంగలను మోసుకొస్తున్న కూలీలు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులను చూసి దుంగలను పడవేసి అడవిలోకి పడవేశారు. దీంతో పోలీసులు అడవిలో ఒక పక్క గాలింపు చేస్తూనే, పడవేసిన 104 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని చంద్రగిరి పోలీస్టేషన్‌కు తరలించారన్నారు. సంఘటనా స్థలాన్ని డి ఐ జి కాంతారావు తెల్లవారి జామున పరిశీలించారు.
‘్ధనీ కేసుపై సుప్రీంలో కౌంటరు వేస్తాం’
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, జనవరి 29: క్రికెటర్ ధోనీపై అనంతపురంలో దాఖలైన కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కౌంటరు వేయనున్నట్లు విహెచ్‌పి నేత శ్యాంసుందర్ తరఫు న్యాయవాది గోపాలరావు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ చిత్రాన్ని ఔట్‌లుక్ పత్రిక ముఖచిత్రంపై ముద్రించినందుకు నిరసనగా అనంతపురం కోర్టులో విహెచ్‌పి నేత దాఖలు చేసిన కేసును బెంగళూరు కోర్టుకు బదిలీ చేయాలంటూ అతని తరపున్యాయవాది సుప్రీం కోర్టు నుంచి స్టే తీసుకురావడంపై ఆయన స్పందిస్తూ దీనిపై తామూ కౌంటరు దాఖలు చేయనున్నామన్నారు. కేసు విచారణను బెంగళూరు కోర్టుకు తరలించాలని పిటీషన్‌లో పేర్కొన్నట్లు తెలిసిందని, అయితే బెంగళూరు కోర్టులో సైతం ధోనీపై కేసు ఉందని ఆయన వివరించారు. అక్కడి కేసును సైతం అనంతపురానికి విచారణకు పంపాలని తాము సుప్రీంకోర్టులో కౌంటర్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
ఆర్జిత టిక్కెట్ల కరెంట్ బుకింగ్ పునః ప్రారంభం
తిరుమల, జనవరి 29 : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు కరెంటు బుకింగ్ విధానాన్ని యథావిధిగా కొనసాగించేందుకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో ఆన్‌లైన్ల ద్వారా కేటాయించిన ప్రత్యేక సేవలైన తోమాల, అర్చన, పూరాభిషేకం మొదలైన సేవలకు సంబంధించిన సేవా టిక్కెట్లను కొందరు భక్తులు రద్దు చేసుకున్న వాటిని కరెంటు బుకింగ్ విధానం ద్వారా భక్తులకు అందజేసేందుకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఇక నిత్యసేవలైన వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, డోలోత్సవం మొదలైన సేవలను కరెంటు బుకింగ్ ద్వారా భక్తులు పొందేందుకు తిరిగి అవకాశం కల్పించింది. ఈ టిక్కెట్లను భక్తులు పొందేందుకు ఒక్కరోజు ముందుగా తిరుమలకు చేరుకుని విజయా బ్యాంకు ఆర్జిత సేవ టిక్కెట్ల కౌంటర్ ద్వారా టిక్కెట్లు పొందేందుకు వీలుండేది. ఈ క్రమంలో భక్తులు ఒక్క రోజుకు ముందుగా తిరుమలకు చేరుకుని క్యూలైన్లలో నిరీక్షించి టిక్కెట్లను పొందాల్సి వచ్చేది.
ప్రజాస్వామ్య పటిష్ఠతే పిఏసి అజెండా
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 29: ప్రభుత్వం చేసిన చట్టాలు, నిర్ణయాలకు సంబంధించి ప్రజాధనం కేటాయింపు, వినియోగం, ప్రయోజనం, సక్రమ విధానంలో ప్రజలకు చేరుతున్నదీ, లేనిదీ అధ్యయనం చేసి నివేదికను సభాపతికి అందజేసి ప్రజాస్వామిక వ్యవస్థను పటిష్ఠపర్చడమే శాసనసభ సంఘాల ప్రధాన అజెండా అని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. రాష్టశ్రాసనసభ అంచనాల కమిటీ గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో సభ్యులు సమావేశమై అధికారులతో చర్చించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. కమిటీ నివేదిక శాసనసభాపతి ముందు ఉంచేవరకు గోప్యంగా ఉంచుతామని, అందుకే చర్చించిన అంశాలను ఏ సభ్యుడూ బహిరంగపర్చరాదన్నారు. జిల్లాలో రాజధాని నిర్మాణం చేపడుతున్నందున సిఆర్‌డిఎలో ప్రధాన అంశంగా తీసుకున్నామన్నారు. సిఆర్‌డిఎ చేపట్టిన అంశాలు, అంచనాల్లో ఏ మేరకు ప్రగతి సాధించిందనే దానిపై చర్చించి తదుపరి చర్యల గురించి కమిటీ సభ్యులతో చర్చిస్తామన్నారు. శాసనసభ్యుడు గద్దె రామమోహనరావు, ఎం గీత, జి శంకర్, తెనాలి శ్రావణ్‌కుమార్, ఉప్పులేటి కల్పన, కె సర్వేశ్వరరావు, కె వెంకటరమణమూర్తి, శాసనమండలి సభ్యులు విశ్వప్రసాదరావు, అప్పారావు ఆదిరెడ్డి, శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. సిఆర్‌డిఎ పరిధిలోని రైతుల సమస్యలపై కమిటీ సభ్యులు అర్జీలు స్వీకరించారు.
అక్రమ మైనింగ్‌తో ఖజానాకు నష్టం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 29: ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ వలన ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని శాసనాసభ ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షుడు భూమా నాగిరెడ్డి వెల్లడించారు. గ్రానైట్ క్వారీల్లో అవకతవకలు నివారించి ప్రభుత్వానికి ఆదాయం పెరిగేవిధంగా నివేదికలు ప్రభుత్వానికి అందిస్తామన్నారు. శుక్రవారం ఒంగోలులోని కలెక్టర్ కాన్పరెన్స్‌హాలులో శాసనసభా ప్రజాపద్దుల కమిటీ గ్రానైట్ క్వారీ లీజుల విషయంపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా భూమా మాట్లాడుతూ గ్రానైట్ క్వారీలను పరిశీలించామన్నారు. చీమకుర్తి గ్రానైట్ మైనింగ్ జోన్‌లోని గ్రానైట్ క్వారీలను పూర్తిస్థాయి సర్వేచేయించి ప్రజాపద్దుల కమిటి లేవనెత్తిన అంశాలకు సంబంధించి నివేదికలను ఒక నెలలో అందచేయాలని అధికారులను ఆదేశించారు. విక్టోరియా గ్రానైట్ సంస్ధ ఏ సర్వేనెంబర్లల్లో లీజుకోసం దరఖాస్తు పెట్టుకున్నారు, ప్రస్తుతం క్వారీపనులు ఎక్కడ చేస్తున్నారని మైనింగ్, రెవెన్యూశాఖాధికారులను కమిటి ప్రశ్నించింది. దీనిమై మైనింగ్, రెవెన్యూ అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. విక్టోరియా గ్రానైట్ సర్వే నెంబరు 55/4లో క్వారీలీజుకు అనుమతి పొంది 55/5లో ప్రస్తుతం తవ్వకాలు జరుపుతోందన్నారు. దీన్ని ఎందుకు అడ్డుకోలేదని కమిటీ జిల్లా అధికారులను ప్రశ్నించింది. అంతేకాకుండా ఎపిఎన్‌యుడిసి స్ధానికంగా గ్రానైట్ రాయి క్యూబిక్ మీటరు 70వేల రూపాయలుండే ఎపిన్‌యుడిసి ఆరువేల రూపాయల ధరకు నిర్ణయించి ప్రభుత్వ ఆదాయం తగ్గించిందని కమిటి పేర్కొంది. కళ్ళముందు ఇంత అన్యాయం జరుగుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారని కమిటి నిలదీసింది.