రాష్ట్రీయం

పట్టణాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: రోజురోజుకూ గ్రామాల నుండి పట్టణాలకు వలస పెరగడంతో పట్టణాల్లో సౌకర్యాలు మృగ్యమైపోతున్నాయని, కాలుష్యం, తాగునీటి సమస్య, రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయని శనివారం నాడిక్కడ మొదలైన అర్బన్ మొబిలిటీ అంతర్జాతీయ సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సును ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. నగరీకరణం శీఘ్రగతిన చోటుచేసుకుంటుంటే నగర ప్రాంతాల్లో ఇపుడు ఉన్న ప్రజారవాణా వౌలిక సదుపాయాలు అరకొర స్థాయిలో ఉండటం సామాజికంగానూ, ఆర్ధికంగానూ, పర్యావరణ పరంగానూ ఎదురవుతున్న పర్యావసానాలపై వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు కీలక ఉపన్యాసం ఇస్తూ ఏ దేశంలో పేదలు కార్లను ఉపయోగిస్తారో, ఆదేశం
అభివృద్ధి చెందిన దేశం కాదని, ఏ దేశంలో ధనికులు సైతం ప్రజారవాణానే వినియోగించుకుంటారో ఆ దేశమే అభివృద్ధి చెందిన
దేశమని పేర్కొన్నారు. చలనశీలత అంటే రవాణా సంబంధ వౌలిక సదుపాయాలను , సేవలను అభివృద్ధిపరచడం ఒక్కటే కాదు, రవాణా పరంగా సామజిక, ఆర్ధిక , రాజకీయ, భౌతిక నిర్బంధాలవను అధిగమించడం కూడా అని ఆయన వివరించారు. చలనశీలత ఒక హక్కు, అధికారంగా గుర్తించడం వెనుక ప్రజలు తమ గమ్యస్థానాలను చేరుకోవడంలో అడ్డునిలుస్తున్న వాటిని తొలగించడంపై దృష్టి కేంద్రీకరించడమేనని అన్నారు. చాలీ చాలని రవాణా వ్యవస్థల వల్ల ఏర్పడే ట్రాఫిక్ రద్దీయే ఆర్ధికపరంగా, ఉత్పాదక పరంగా గణనీయమైనటువంటి నష్టాలకు కారణం అని , మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగరాల్లో ఈ సమస్య తలెత్తుతోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నగర ప్రాంతాల జనాభా విపరీతంగా పెరిగిపోవడం అనేది అభివృద్థి చెందుతున్న దేశాల్లో చోటు చేసుకుందని అన్నారు. గతిశీలతకు, రవాణా చేయడానికి మధ్య అస్పష్టత ఉందని వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అస్పష్టత సొంత వాహనాల సంఖ్య హెచ్చుమీరడానికి, నగర ప్రాంతాల్లో రహదారుల నెట్‌వర్కు విస్తరించే ధోరణి కూడా దారితీస్తోందని అన్నారు. రద్దీని తగ్గించడానికి ఫ్లైఓవర్లు నిర్మించి, నగర ప్రాంత రహదారులను విస్తరించినంత మాత్రాన సరిపోదని అన్నారు. రద్దీ నివారణకు మరిన్ని రోడ్లను నిర్మించడం అంటే లావైన వ్యక్తి స్థూలకాయం భారి నుండి బయటపడడానికి తన బెల్టును వదులు చేసుకోవడం వంటిదని చమత్కరించారు. నగరాల్లో, పట్టణాల్లో ఆధారపడ్డ ప్రజారవాణా వ్యవస్థలు ఏర్పడటంపై శ్రద్ధ వహించాలని అన్నారు. వరసలోని చివరి వ్యక్తికి సైతం అనుసంధాన సదుపాయం అందాలని, సైకిళ్లను ఉపయోగించడం, నడవడం వటి యంత్ర రహిత రవాణా పద్ధతులను అవలంభించాలని , వివిధ రకాలైన రవాణా మధ్య సమన్వయం ఏర్పడాలని, భూమి ఉపయోగం , రవాణా ప్రణాళిక రచలను సంఘటితం చేయాలని, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్‌మెంట్ ద్వారా డెన్స్ అండ్ వర్టికల్ అర్బన్ గ్రోత్ దిశగా సాగాలని అన్నారు. కొత్త కొత్త విధానాలలో ఆర్ధిక సాయం పొందాలని, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాలకు మళ్లాలని సూచించారు. మరింత ఉత్తమమైన పట్టణ ప్రాంత ప్రణాళికా రచన అవసరమని, పర్యావరణానికి హాని కలుగని రీతిలో నగర ప్రాంతాలు వృద్ధి చెందేలా ప్రజా రవాణా సదుపాయాలను తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. నగర ప్రాంత రవాణా రంగంలో పర్యావరణ సంబంధ సవాళ్లలో అనేక సవాళ్లు వ్యక్తిగత మోటార్ వాహనాలను నడపడానికి పునరుత్పాదకతకు వీలు లేనటువంటి శిలాజ ఇంధనంపై ఆధారపడుతూ ఉండటం ద్వారానే తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. శుద్ధ ఇంధనాల వైపునకు మనం కదలాల్సిన అవసరం ఉంది, కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలను పక్కన పెట్టాలి, సామూహిక రవాణా సాధనాలను పటిష్టపరచాలి, విద్యుత్‌తో నడిచే వాహనాలను ఉపయోగించాలి, ఏదైనా ఒక కారును రిజిస్టర్ చేసే కన్నా ముందే పార్కింగ్ స్థలం ఉన్నదీ లేదిదీ తనిఖీ చేసే వ్యవస్థ రావాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్‌లర్ , ప్రభుత్వ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వెంకయ్యనాయుడు అర్బన్ ఎక్స్‌పోను ప్రారంభించారు. కొడాటో ప్రచురించిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధ దేశాల నుండి దాదాపు 500 మంది ప్రతినిధులు, భారత్ నుండి వెయ్యి మంది ఈ సదస్సులో పాల్గొన్నారు. వేదిక మీదకు వెళ్లే ముందు ప్రోటోకాల్ పక్కన పెట్టి ఉప రాష్టప్రతి విదేశీ ప్రతినిథుల వద్దకు వెళ్లి పలకరించారు.

చిత్రం..అర్బన్ మొబిలిటీ అంతర్జాతీయ సదస్సును ప్రారంభిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్య