రాష్ట్రీయం

వెనక్కి తగ్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణలో ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచి తీరుతామని, ఈ అంశంపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం ఆమోదం నిమిత్తం పంపామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి నివేదించామన్నారు. శనివారం ఆయన శంషాబాద్‌లో జరిగిన అఖిల భారత ముస్లిం విద్యాసొసైటీ సమావేశానికి పంపిన సందేశంలో పై విధంగా అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పంపిన మూడు పేజీల సందేశాన్ని మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఎకె ఖాన్ సభలో చదివి వినిపించారు. ముస్లింల జీవన స్ధితి గతులు బాధాకరంగా ఉన్నాయని, వెనకబాటుతనం నుంచి విముక్తి కల్పించేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1250కోట్ల నిధులు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 206 మైనార్టీ గురుకుల పాఠశాలలు నెలకొల్పామన్నారు. ఈ పాఠశాలల్లో 50 వేల మంది విద్యార్ధులు చేరారన్నారు. ప్రతి విద్యార్థికి సాలీనా రూ.65 వేలు ఖర్చుపెడుతున్నామన్నారు. ఐదు ఎకరాల స్ధలంలో 20 కోట్ల రూపాయల వ్యయంతోవౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మొత్తం పాఠశాలల్లో 50 శాతం బాలికలకు కేటాయించామన్నారు. సాలీనా 1.35 లక్షల మంది బాలబాలికలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలతో
సమానంగా ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను అమలు చేస్తున్నామని, దీనికి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించామన్నారు. విదేశీ విద్య అభ్యసించేందుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.20 లక్షలు ఇస్తామన్నారు. బడ్జెట్‌లో ఈ నిధి కింద రూ.40 కోట్లు కేటాయించామన్నారు. సివిల్ సర్వీసు పరీక్షలకు ప్రిపేరయ్యే వంద మందివిద్యార్ధులకు ఉన్నత ప్రమాణాలతో శిక్షణ ఇస్తున్నామన్నారు. షాది ముబారక్ స్కీం కింద ప్రతి ముస్లిం యువతికి వివాహం సమయంలో రూ.75,116 ఇస్తున్నట్లు చెప్పారు. ఈ స్కీం కింద 68,786 మంది యువతులకు ఇంతవరకు రూ. 363.54 కోట్లు కేటాయించామన్నారు. రంజాన్ పండగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు 400 ఎంపిక చేసిన మసీదుల ద్వారా కొత్త దుస్తులను పంపిణీ చేస్తున్నామన్నారు. ఉర్దూ భాషకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. ఉత్తమ ఉర్దూ టీచర్లు, ఉత్తమ ఉర్దూ విద్యార్ధులకు అవార్డులు ఇస్తున్నామన్నారు. మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లకు నెలకు పదివేల రూపాయల పారితోషికం ఇస్తున్నామన్నారు. ఉస్మానియా వర్శిటీలో దైరాతుల్ మారిఫ్ ఉస్మానియా భవనాన్ని, అక్కడ ఉన్న విలువైన పుస్తకాల భద్రతకు రూ. 37.71 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముస్లిం విద్యా వేత్తలు హాజరయ్యారు.

చిత్రం..అఖిల భారత ముస్లిం విద్యా సొసైటీ సదస్సులో
ముఖ్యమంత్రి కెసిఆర్ తరపున సందేశాన్ని చదివి వినిపిస్తున్న మైనార్టీ సంక్షేమశాఖ సలహాదారు ఎకె ఖాన్