రాష్ట్రీయం

ఆర్టీసీపై శీతకన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 5: రాష్ట్ర విభజన తరువాత కూడా ఏపీఎస్ ఆర్టీసీని నష్టాల పీడ వీడలేదు.ప్రస్తుతం 4వేల కోట్ల రూపాయల నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణా వల్లనే ఏటా కనీసం రూ. 1700 కోట్ల పైగా ఆర్టీసీ రాబడికి గండి పడుతోందని అంచనా. ఆర్టీసీపై రాయితీల భారం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంస్థకు ఎలాంటి ఆర్థిక సహాయం అందటం లేదు. పైగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆర్టీసీ వినియోగించే డీజిల్ పైనా ప్రభుత్వం వ్యాట్ అమలు చేస్తోంది. నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా కనీసం రూ.600 కోట్ల మేర తమ వాటా మొత్తం చెల్లించాల్సి ఉండగా
దశాబ్ద కాలంగా అలా జరగటం లేదు. గుజరాత్, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెవెలుగు వంటి బస్సు సర్వీస్‌లకు పూర్తి ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఇలాంటి ప్రోత్సాహకాలు లేకపోవటంతో ఎపీఎస్ ఆర్టీసీ ప్రతి ఏటా అప్పుల కోసం రూ. 150 కోట్లు, వడ్డీ కింద మరో రూ. 150 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. కార్మికులు ఎంతగా సహకరిస్తున్నప్పటికీ సాలీనా కనీసం రూ. 600 కోట్ల నష్టాలతో సంస్థ భారంగా నడుస్తోంది. వాస్తవానికి ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణా వల్లే ఆర్టీసీ కుదేలవుతోంది.
ఏపీ మోటారు వెహికల్ రూల్స్ ప్రకారం ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు కనీసం కి.మీ నుంచి 3 కి.మీల లోపల ఎలాంటి ప్రైవేట్ వాహనాలు నిలుపకూడదు. ఆటోలు సైతం నిర్దేశిత రూట్లలోనే కాంట్రాక్ట్ క్యారియర్లుగా తిరుగాలి. పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ జరిగినా స్లీపర్ కోచ్ బస్సులు రాష్ట్రంలో తిరగకూడదు. కాంట్రాక్ట్ పర్మిట్ తీసుకుని వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకునే విధానం లేనప్పటికీ నిత్యం ఒక్క విజయవాడ మీదుగానే 200లకు పైగా ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. లారీలపై ప్రయాణికులను ఎక్కించకూడదనే నిబంధనను ఎవరూ పాటించటం లేదు. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 94వేల వివిధ రకాల ప్రైవేట్ వాహనాలు తిరుగుతుండటం వల్ల ఆర్టీసీ ఏటా రూ. 1700 కోట్ల ఆదాయాన్ని నష్టపోతోంది.
మరో విడ్డూరం ఏమంటే ఆర్టీసీ ప్రతి టిక్కెట్‌పై వచ్చే ఆదాయంలో 7శాతం పన్ను చెల్లించాల్సి వుంటే, అదే ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు మూడు మాసాలకు సీటుకు 3వేల 400 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇక పన్ను విధానం ఇరుగుపొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో దారుణంగా ఉంది. ఆదాయంలో ఇక్కడ 5 శాతం పన్ను విధిస్తే, చెన్నైలో 1.5 శాతం, ఢిల్లీలో 1.78 శాతం, ముంబైలో 3 శాతం, కోల్‌కత్తాలో 0.72 శాతం, గుజరాత్‌లో ఒక శాతం చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక జిల్లా సర్వీసులలో రాష్ట్రంలో 7 శాతం అయితే, తమిళనాడులో పన్ను 5 శాతం మాత్రమే. ప్రతి అంశంలోనూ ప్రధాని మోదీ గతంలో పరిపాలించిన గుజరాత్‌ను ఆదర్శంగా తీసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఒకసారి ఆలోచించాల్సిన అవసరముంది. గుజరాత్‌లో సిటీబస్ సర్వీసుల నష్టాన్ని పూర్తిగా ఆ ప్రభుత్వమే భరిస్తోంది. సిటీ బస్సులకు పన్ను కేవలం ఒక శాతం అయితే, మన రాష్ట్రంలో ఐదు శాతం. అక్కడ విద్యార్థులకిచ్చే రాయితీని నూటికి నూరు శాతం ప్రభుత్వమే భరిస్తుంటే ఇక్కడ అలా లేదు. అక్కడ కొత్త బస్సుల కొనుగోలుకు గ్రాంట్ మంజూరు చేస్తారు. ఇక్కడలా లేదు. అక్కడ 8 లక్షల కి.మీలు తిరిగిన బస్సులను నిలిపివేస్తుంటే ఇక్కడ 14 లక్షల కి.మీలు తిరిగినా అతీగతీ లేదు.
తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రతి ఏటా రోడ్డు రవాణా సంస్థలకు రూ. 500 కోట్లకు పైబడి ప్రభుత్వ నిధులు అందుతున్నాయి. అయితే ఏపీఎస్ ఆర్టీసీ నియమించే ఐఐఎం బెంగుళూరు కమిటీ ప్రతి ఏటా రూ. 250 కోట్లు కేటాయించాలని 15ఏళ్ల క్రితమే నివేదిక అందజేసినా అతీగతీ లేదు.ఈనేపథ్యంలో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ ‘ప్రజా రవాణా సంస్థ’ ఆర్టీసీని పరిరక్షించండంటూ ఉద్యమాన్ని ప్రారంభించింది.