రాష్ట్రీయం

ఐదుగురు మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 5: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యంకాగా మరొకరి మృతదేహం కోసం గాలింపుచేపట్టారు. భీమవరానికి చెందిన చినమిల్లి నాగవెంకట సత్యనారాయణస్వామి, మునగాల వాసు, పత్తి సురేంద్ర, బుడితి అవినాష్, కుమార్ అనే ఐదుగురు మిత్రులు బైక్‌లపై పేరుపాలెం బీచ్‌కు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఐదుగురు స్నేహితులు సముద్రంలో స్నానం చేస్తుండగా సురేంద్ర, అవినాష్, కుమార్ గల్లంతయ్యారు. కొద్దిసేపటికి గల్లంతైన వారిలో పత్తి సురేంద్ర (22), బుడితి అవినాష్ (28) మృతదేహాలు కొట్టుకువచ్చాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నరసాపురం సిఐ ఎం సుబ్బారావు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతదేహాలను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కార్తీక మాసాన్ని
పురస్కరించుకుని ఆదివారం వేల సంఖ్యలో బీచ్‌కు ప్రజలు తరలివచ్చారు. ఈ ఘటనతో బీచ్‌లో విషాద వాతావరణం నెలకొంది.
స్వర్ణముఖిలో ఇద్దరు చిన్నారుల మునక
నాయుడుపేట: భారీ వర్షాలకు స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాన్ని చూడటానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. మూడు రోజుల నుండి స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎప్పుడూ నీరులేక ఎండిపోయి కనిపించే నదికి నీరు రావడంతో పట్టణంలోని జనం ఆ దృశ్యాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా వెళుతున్నారు. ఈనేపథ్యంలో నదీ సమీప ప్రాంతమైన మంగపతినాయుడు నగర్‌కు చెందిన ఐదుగురు చిన్నారులు నదీ ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లారు. వీరు వెళ్లిన ప్రాంతంలో ఇసుక తవ్విన గుంతలున్న విషయం తెలియకపోవడంతో మల్లీశ్వరి (9), జాకీర్ (7), మరో చిన్నారి మన్విత నదిలోకి దిగి ప్రవాహంలో ఇరుక్కున్నారు. విషయం గ్రహించిన స్థానికుల్లో ఇద్దరు వ్యక్తులు మన్వితను కాపాడగలిగారు. మల్లీశ్వరీ, జాకీర్ నదిలో మునిగి మృత్యువాత పడ్డారు. సుమారు గంటసేపు గాలించిన తరువాత ఇద్దరి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు.