రాష్ట్రీయం

విశాఖ తీరంలో బాంబుల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 29: హోరున శబ్దం చేసుకుంటూ తీరం వైపునకు దూసుకొచ్చే యుద్ధ విమానాలు.. శత్రువులను మట్టుపెట్టేందుకు జెమినీ బోట్లపై తరుముకొచ్చే కమాండోలు.. ఒకపక్క యుద్ధ ట్యాంకర్లు, మరోపక్క సముద్ర జలాలపై అత్యంత వేగంగా ప్రయాణిస్తూ శుత్రువులను మట్టుపెట్టేందుకు బయల్దేరిన యుద్ధ నౌకలు.. సముద్రంలో ఎక్కడి నుంచైనా యుద్ధ నౌకలపై రివ్వున ఎగిరి శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి, రెప్పపాటు కాలంలో తిరిగి యుద్ధ నౌకలపై వాలిపోయే సీ హారియర్స్, మిగ్-29 జెట్ ఫైటర్స్.. ఇదంతా యుద్ధ భూమిని తలపించడం లేదూ! యుద్ధరంగంలో శత్రుసేనలను మన సైన్యం మట్టుపెట్టే దృశ్యాలను సాధారణ ప్రజలు చూడలేరు. ఆ దృశ్యాలన్నింటినీ శుక్రవారం విశాఖలోని ఆర్‌కె బీచ్‌లో జనం కళ్లార్పకుండా చూశారు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను చూస్తూ కేరింతలు కొడుతూ ఔరా.. అని ఆశ్చర్యపోయారు. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ విశాఖ జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) కోసం మూడు రోజులపాటు ఆర్‌కే బీచ్ తీరంలో భారత నౌకాదళం చేసిన రిహార్సల్స్ శుక్రవారం ముగిశాయి. శనివారం నుంచి ఫ్లీట్ రివ్యూపైనే నేవీ అధికారులు దృష్టి సారించనున్నారు. శుక్రవారం జరిగిన రిహార్సల్స్‌లో భారత నౌకదళంలోని అతి భారీ యుద్ధ నౌకలైన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విరాట్‌లపై నుంచి మిగ్-29కె, సీహారియర్స్ యుద్ధ విమానాలు నిప్పులు చిమ్ముతూ టేకాఫ్ అవడం విశేషం. ఈ యుద్ధ విమానాలు గాల్లో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. సీహారియర్స్, మిగ్-29కె ఆకాశంలో దూసుకువెళుతూ బాంబుల వర్షం కురిపించే సన్నివేశం అద్భుతంగా ఉంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ నౌకలు తీరానికి మరింత దగ్గరగా రావడంతో ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

తీరంలో యుద్ధట్యాంకుల విన్యాసం

ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక నుంచి దూసుకెళుతున్న మిగ్-29కె యుద్ధ విమానం కమాండోల పోరాటం

కాపుల బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు

సభ నిర్వహణకు 80ఎకరాలు సిద్ధం ఐదు లక్షలకుపైగా వస్తారని అంచనా

రాజమహేంద్రవరం, జనవరి 29: కాపులను బిసిల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండుతో ఈనెల 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకుని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జరగనున్న బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం నుండి విశాఖ వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిలో అన్నవరం దాటిన తరువాత తేటగుంట చెక్‌పోస్టు-తుని రూరల్ పోలీస్టేషన్‌కు మధ్యన రోడ్డుకు ఎడమవైపు బహిరంగ సభ నిర్వహణకు 80 ఎకరాలు సిద్ధంచేశారు. రాష్ట్రంలోని 13జిల్లాల నుండి బహిరంగ సభకు వచ్చే వారి వాహనాలను నిలపడానికి 16చోట్లకు పైగా సుమారు 80 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల నుండి కూడా కాపులు ఈ సభకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని గ్రామాల నుండి తుని సభకు కాపులు బయలుదేరేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారు సభ అనంతరం తిరిగి వెళ్లేటపుడు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందు నుండే ప్రణాళికాబద్ధంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు సభ ప్రారంభమై సాయంత్రం 6గంటలకు ముగిసేలా కార్యాచరణను ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలోని కాపు పెద్దలు రూపొందిస్తున్నారు. సభకు అయిదు లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా. సభా వేదికపై కుర్చీలు లేకుండా ప్రత్యేక తరహాలో బహిరంగ సభను నిర్వహించాలని ముద్రగడ భావిస్తున్నట్టు సమాచారం. బహిరంగ సభకు ఎంత మంది కాపు పెద్దలు హాజరైనాగానీ, ముద్రగడ పద్మనాభంతో సహా అంతా వేదిక కిందే కూర్చుంటారు. కాపు ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలి? బిసిల్లో చేర్చాలన్న డిమాండ్‌ను సాధించుకోవడానికి ఉద్యమ స్వరూపం ఎలా ఉండాలి? తదితర అంశాలపై సభలో మాట్లాడేందుకు ప్రతి జిల్లా నుండి కొంత మందికి ప్రాతినిధ్యం కల్పిస్తారు. అలా మాట్లాడే వారు మాత్రమే ఒకరి తరువాత మరొకరు వేదికపైకి వెళ్లి నిర్ణయించిన సమయానికి మించకుండా మాట్లాడి రావాల్సి ఉంటుంది. అంటే వేదికపై సభలో మాట్లాడేవారు ఒక్కరు మాత్రమే ఉంటారన్న మాట. కాపు ఉద్యమ సారధి ముద్రగడ పద్మనాభం మాత్రం సభలోని పరిస్థితులను బట్టి ఒకటి రెండు సార్లు ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. సభలో మాట్లాడేవారు రాజకీయాలు మాట్లాడకుండా, కేవలం కాపు ఉద్యమానికే తమ ప్రసంగాన్ని పరిమితం చేసే విధంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాజరైన వారందరికీ సభ కనిపించే విధంగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.