రాష్ట్రీయం

కేటీఆర్.. ఇమేజ్ టవర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: హైదరాబాద్ కిరీటంలో మరొక ఆణిముత్యం చేరబోతోంది. 946 కోట్ల రూపాయల అంచనాతో నిర్మించనున్న ఇమేజ్ టవర్స్‌కు ఆదివారం రాష్ట్ర ఐటి మంత్రి కె. తారకరామారావు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో దినదినాభివృద్ధి చెందుతున్న యానిమేషన్, గేమింగ్, విఎఫ్‌ఎక్స్ పరిశ్రమలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ప్రాజెక్టుకు సంకల్పించినట్టు కెటిఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఈ రంగంలో హైదరాబాద్‌లో వందకు పైగా కంపెనీలు ఉన్నాయన్నారు. బాహుబలి, అరుంధతి, మగధీర, లైఫ్ ఆఫ్ పైలాంటి సినిమాల గ్రాఫిక్స్ పనులన్నీ హైదరాబాద్‌లోని స్టూడియోల నుంచే జరిగాయన్న విషయాన్ని కెటిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్లాక్‌బస్టర్ ఇంగ్లీష్ మూవీలకూ ఇక్కడే విఎఫ్‌ఎక్స్ చేశారన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యానిమేషన్, విఎఫ్‌ఎక్స్ రంగాల్లో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. దాదాపు 16 ఎకరాల్లో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణలో ఇమేజ్ టవర్స్ నిర్మిస్తున్నామని, దీన్ని ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం (పిపిపి) కింద చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఇమేజ్ టవర్స్‌కు 946 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. మూడేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. గేమింగ్, యానిమేషన్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇమేజ్ టవర్స్‌లో ‘టి’ సింబల్ అనేది తెలంగాణ టెక్నాలజీని సూచిస్తుందన్నారు. కార్యక్రమంలో రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు కొండా విశే్వశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో నిర్మించనున్న ఇమేజ్
టవర్స్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీ రామారావు