రాష్ట్రీయం

పత్తి బరువై.. బతుకు చిత్తయ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం శాస్ర్తియ విధానాన్ని అమలు చేయకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. పత్త్ధి ఈ ఏడాది లాభదాయకంగా ఉంటుందని భావించిన రైతులు దాదాపు 48 లక్షల ఎకరాల్లో పంట వేశారు. తీరా పత్తి మార్కెట్లోకి వచ్చే సమయానికి కనీస మద్దతు ధర సరిగ్గా లభించక నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం పత్తి కనీస మద్దతు ధరను 4320 రూపాయలుగా ప్రకటించగా, మార్కెట్లో పత్త్ధిర క్వింటాల్‌కు 3700 రూపాయల నుండి 3800 మధ్య నడుస్తోంది. నాణ్యమైన పత్తికి మాత్రం అతి కష్టంగా ఎంఎస్‌పిని చెల్లిస్తున్నారు. గత ఏడాది పత్తి క్వింటాల్ ధర 5000 రూపాయలకుపైగా నడిచింది. 2016 ఖరీఫ్ సీజన్‌లో పత్తిపంట వేయవద్దని ప్రభుత్వం ప్రకటించడంతో విస్తీర్ణం బాగా తగ్గింది. గత ఏడాది కేవలం 25 లక్షల ఎకరాల్లోనే పత్తి వేశారు. దాంతో దిగుబడి తగ్గడంతో గత ఏడాది పత్తి ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుత సంవత్సరం (2017-18) పత్తిపంట గురించి ప్రభుత్వ పట్టించుకోలేదు. గత ఏడాది పత్తికి మంచి ధర లభించడంతో ఈ ఏడు రైతులు అధికశాతం పత్తివేశారు. పంట విస్తీర్ణం విపరీతంగా పెరగడంతో మార్కెట్ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ సంవత్సరం మార్కెట్లోకి 28 లక్షల నుండి 30 లక్షల టన్నుల పత్తి వస్తుందని అంచనా వేశారు. దీన్ని కొనుగోలుచేసేందుకు 201 కొనుగోలు కేంద్రాలను కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 143 పత్తికొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కేంద్రాన్ని కోరగా, అంతకు మించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ తదితర పాత జిల్లా ప్రాంతాల్లోని
మార్కెట్లలో పత్తికొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తాజా సమాచారం ప్రకారం మార్కెట్లోకి 11 లక్షల క్వింటాళ్ల పత్తి రాగా, 3.60 లక్షల క్వింటాళ్లకు మాత్రమే ఎంఎస్‌పి లభించింది. మిగతా పత్తికి క్వింటాల్‌కు 300 నుండి 500 రూపాయలు తక్కువగా లభిస్తోంది. పూర్తిగా నాణ్యమైన పత్తికి మాత్రం ఆదిలాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో 4400 నుండి 4500 మధ్య ధర లభిస్తోంది.
20 లక్షల రైతులకు గుర్తింపు కార్డులు
రాష్ట్రంలోని 20 లక్షల మంది పత్తిరైతులకు మార్కెటింగ్ శాఖ గుర్తింపు కార్డులు జారీ చేసింది. ప్రభుత్వ విధానం ప్రకారం రైతులకు పత్తికి సంబంధించి ధర బ్యాంకు ఖాతాల్లో పడుతోంది. చాలా ప్రాంతాల్లో రైతులు తాము మార్కెట్‌కు తీసుకువస్తున్న పత్తికి సరైన ధర లభించడం లేదన ఆందోళనలకు దిగుతున్నారు. ఈ పరిస్తితిలో ఎలాగైనా రైతులను సంతృప్తిపరిచేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది.