రాష్ట్రీయం

కాంగ్రెస్ తెరపై విజయశాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: సినీ నటి, మెదక్ మాజీ ఎంపి విజయశాంతి కాంగ్రెస్ ‘తెర’పై మళ్లీ చురుకైన పాత్రలో కనిపించబోతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత విజయశాంతి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మూడేళ్ళు గడిచాయని, 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదు కాబట్టి మళ్లీ విజృంభించాలని కాంగ్రెస్ నాయకులు ఆమెను కోరుతున్నారు. ఇలాఉండగా ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా, టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆమెను కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆహ్వానించారు. అందుకు ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి ముందుకు వస్తే పార్టీ ప్రచార బాధ్యతను పూర్తిగా అప్పగిస్తామని కుంతియా ఆమెతో అన్నట్లు తెలిసింది. వివిధ కారణాలతో పార్టీకి దూరమైన వారిని, శక్తి ఉన్నా పార్టీలో చురుగ్గా పాల్గొనకుండా దూరంగా ఉంటున్న వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు ఉత్తమ్ నడుం బిగించారు. టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. ఇంకా మిగతా పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న వారిని, బలవంతులైనప్పటికీ అవకాశాలు రాక రాజకీయాలకూ దూరంగా ఉంటున్న వారిని, వివిధ వృత్తుల్లో ఉన్న వారిని, వ్యాపారులను కాంగ్రెస్‌లో చేర్పించేందుకు కుంతి యా, ఉత్తమ్ కృషి చేస్తున్నారు.