రాష్ట్రీయం

హైదరాబాద్‌లో పొంచి ఉన్న స్వైన్‌ఫ్లూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: పాలకుల నిర్లక్ష్యం, సంబంధిత అధికారుల అలసత్వం కారణంగా మహానగరాన్ని డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధులు వణికిస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని సికిందరాబాద్, పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో డెంగ్యూ ఆనవాళ్లు కన్పించిన సంగతి తెలిసిందే! దీనికి తోడు గడిచిన కొద్దిరోజులుగా వాతావరణం బాగా చల్లబడటంతో స్వైన్ ఫ్లూ భయం కూడా ప్రజలను వెంటాడుతోంది. ప్రతి సంవత్సరం ఇదే నెలలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ సారి వర్షాలు రికార్డు స్థాయిలో కురవటంతో చలి ప్రభావం ఎక్కువ ఉండే అవకాశముండటంతో స్వైన్ ఫ్లూ భయం కమ్ముకుంది. కొద్దిరోజుల క్రితం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు పారిశుద్ధ్యం స్తంభించిపోవటం, పలు చోట్ల చెత్త తడిసి దోమలు వృద్ధి చెంది డెంగ్యూ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారెందరో స్థానిక ప్రైవేటు క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. వ్యాధి ముదిరిన తర్వాత వారు ఫీవర్ ఆసుపత్రిని గానీ, గాంధీ ఆసుపత్రిని గానీ ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులు, డెంగ్యూ అనుమానిత లక్షణాలతో ఫీవర్ ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య రెట్టింపయ్యింది. అలాగే శివార్లలోని చాలా ప్రాంతాల్లో ఓపెన్ డ్రైనేజీలు ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగీ వ్యాధి ప్రబలుతోందని మురికివాడల ప్రజలు వాపోతున్నారు. అనుమానిత లక్షణాలతో రోజుల తరబడి ప్రైవేటు క్ల్లినిక్‌లలో చికిత్స పొందినా, నయం కాకపోవటంతో, వ్యాధి బాగా ముదిరిన తర్వాత సర్కారు ఆసుపత్రులకు వచ్చినపుడే మాత్రమే స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వ్యాధులు సోకినట్లు నిర్థారణ అవుతోంది. ప్రస్తుతం ఈ రెండు వ్యాధులకు సంబంధించిన అనుమానిత లక్షణాలు అనేక మందిలో కన్పిస్తున్నా, కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కావల్సిన వైద్య పరీక్షలు నిర్వహించటం లేదు. ముఖ్యంగా పేదలు ఎక్కువగా నివసించే బస్తీలు, మురికివాడల ప్రజలకు ఈ వ్యాధి పట్ల అవగాహన లేకపోవటంతో వారు సాధారణ అనారోగ్యమేనని భావించి, వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రులను ఆశ్రయించినా ఫలితం దక్కటం లేదు.