రాష్ట్రీయం

భారీ విధ్వంసానికి మావోల యత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం (నూగూరు), నవంబర్ 6: భూపాలపల్లి జిల్లా వెంకటాపురం- భద్రాచలం ప్రధాన రహదారి అలుబాక గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై మావోయిస్టులు అమర్చిన శక్తివంతమైన మందుపాతరలను పోలీసులు సోమవారం నిర్వీర్యం చేశారు. ఏటూరునాగారం ఎఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన రహదారిపై కల్వర్టు సమీపంలో ఎవరికీ అనుమానం
రాకుండా రోడ్డు కింద భాగం నుండి సొరంగం తవ్వి రెండు మందుపాతరలను అమర్చారు. పోలీసులను లక్ష్యంగా తీసుకుని మందుపాతరలను చాలారోజుల కిందటే అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మందుపాతరల సమాచారం అందడంతో సోమవారం వేకువజామున బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ డాగ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీసు బృందాలు మందుపాతరలున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన మార్గంపై ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఏటూరునాగారం ఏసీపీ రాహుల్ హెగ్డె పర్యవేక్షణలో వెంకటాపురం సీఐ రవీందర్, ఎస్సై బండారి కుమార్‌లు జేసీబీ సహాయంతో రోడ్డును తవ్వి మందుపాతరలను వెలికితీసి నిర్వీర్యం చేశారు. చర్ల, శబరి మావోయిస్టు కమిటీలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.