రాష్ట్రీయం

ఇక యుద్ధ ‘నగరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 6: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలితో లేచి విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రోజాకు టీడీపీ చెక్ పెట్టనుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని అమలుచేస్తూ ఆమెకు పోటీగా మాజీ హీరోయిన్ వాణీ విశ్వనాథ్‌ను తెరపైకి తీసుకొస్తోంది. ఈమేరకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి
ఆమెను పార్టీలోకి తీసుకువస్తున్నారు. బాబును కలిసేందుకు విజయవాడ వచ్చిన వాణీ విశ్వనాథ్ సోమవారం మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. తాను పార్టీలో చేరనున్నానని, మంగళవారం బాబును కలుస్తానని ప్రకటించారు. ‘పార్టీ ఆదేశిస్తే రోజాపై పోటీకి సిద్ధం. నిజానికి నాకు రోజా పోటీ అనుకోవడం లేదు. నేను మలయాళీ అయినా తెలుగువాళ్లంటే ఇష్టం. నా సినిమాలు ఎక్కువగా ఆదరించారు. రాష్ట్రంలో బాబు పరిపాలన చాలాబాగుంద’ని కితాబు ఇచ్చారు. కాగా, నిత్యం బాబుపై విమర్శలు గుప్పిస్తూ కంట్లో నలుసులా మారిన రోజా చాలాకాలం నుంచి, తన నగరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలను సొమ్ము చేసుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. అందుకే ఆమెకు పోటీగా సినీ రంగానికే చెందిన వాణీ విశ్వనాథ్‌ను తీసుకురావడం ద్వారా, రోజాను కేవలం తన నియోజకవర్గానికే పరిమితం చేసే వ్యూహానికి టీడీపీ నాయకత్వం తెరలేపింది. వాణీ విశ్వనాథ్‌ను పార్టీలోకి తీసుకురావడం ద్వారా, రోజా రాష్ట్రంలో తిరిగే అవకాశం లేకుండా పోతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

చిత్రం..వాణీ విశ్వనాథ్‌