రాష్ట్రీయం

రాష్ట్రంలో మాఫియా పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/ రాయచోటి, నవంబర్ 6: రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోందని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా సిఎం చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి జన్మభూమి గ్రామకమిటీల పేరుతో దొంగల ముఠా, మాఫియా సామాజ్రాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. అభివృద్ధి పేరట 96 వేల కోట్లు అప్పులు తెచ్చి 60 సంవత్సరాల అభివృద్ధిని వెనక్కునెట్టారని నిప్పులు కక్కారు. కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టనున్న ప్రజా సంకల్ప పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ తనకు డబ్బుపై మమకారం లేదని, చంద్రబాబు లాగా కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. జాబు రావాలంటే బాబు పోవాలని పిలుపునిచ్చారు. తాను చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్నదే తన కసి అన్నారు. విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, విద్యా విప్లవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఆర్ధిక స్థోమత లేని పేదవారిని డాక్టర్లుగా, ఇంజనీర్లులాగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రం అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మారిందని, అవినీతి పరులను జైళ్లలో పెట్టి అభివృద్ధే ఆంధ్రప్రదేశ్‌గా మార్చన్న కసితో ఉన్నానన్నారు. ఇవి అన్ని చేయాలంటే ప్రజల ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు ఉండాలని అన్నారు. రైతులకు వ్యవసాయాన్ని పండుగలాగా చేస్తానన్నారు.
రాజధాని నిర్మాణం అంటే సినిమా సెట్టింగులు కాదని జగన్ అన్నారు. చంద్రబాబునాయుడు బహుబలి సినిమా చూసి బాహుబలి సామ్రాజ్యమే రాజధాని నిర్మాణం అంటారని ఎద్దేవా చేశారు. సింగపూరు వెళ్తే సింగపూరే రాజధాని నిర్మాణం అని చెబుతాడు. ఇంకా నయం బాబు ఇంగ్లీషు సినిమాలు చూడటం లేదు లేదంటే అక్కడి సెట్టింగ్‌లు పెట్టించేవాడన్నారు. శాశ్వత రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుకరాయి అయినా వేశారా అని జగన్ ప్రశ్నించారు. విభజన జరిగినప్పుడు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతామని చంద్రబాబునాయుడు చెప్పారని, మీకు ఏమైనా స్టీల్ ఫ్యాక్టరీ కనిపించిందా అని అయన ప్రజలను ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చరిత్ర చంద్రబాబు నాయుడిది అన్నారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల్లో 85 శాతం పూర్తి చేసింది దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మిగిలిన 15 శాతం పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా చేస్తూనే ఉన్నారని తెలిపారు. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా పూర్తి కాదన్నారు.
సంతలో గొర్రెలను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనడం నీచరాజకీయ సంస్కృతికి నిదర్శనమన్నారు. నంద్యాలలో మేం గెలిచాం అని అనడం కాదు, పార్టీ ఫిరాయించిన వారి చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తే ఎవరు గెలుస్తారో చూద్దామని చంద్రబాబు నాయుడు జగన్ సవాల్ విసిరారు. విజయవాడలో సెక్స్ రాకెట్ నడుస్తుంటే వారిపై చట్టాలు లేవు, కేసులు లేవన్నారు. ఇసుక మాఫియాలో ఒక మహిళా తహసీల్దార్‌ను ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తే వారిపై కేసులు ఉండవు. ఇదేనా పాలన అని ప్రశ్నించారు. గడిచిన 60 ఏళ్లలో రాష్ట్రానికి 60 వేల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సుమారు లక్షా 9వేల కోట్లు అప్పుగా తెచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 55లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం ఉండేదని, ప్రస్తుతం అది 48 లక్షల హెక్టార్లుకు పడిపోయిందని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గతంలో ధర్నాలు చేసినట్లు ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ పాదయాత్రలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వైకాపా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
మాది రెండు పేజీల మేనిఫెస్టో
ఎన్నికల సమయంలో వైకాపా కేవలం రెండు పేజీల మేనిఫెస్టో విడుదల చేస్తుందని పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో మిగతా పార్టీలు పేజీలకు పేజీలు మేనిఫెస్టోలు తయారుచేసి గద్దెనెక్కాక వాటిని బుట్టదాఖలు చేస్తుంటాయని, అయితే దానికి పూర్తి విరుద్దంగా తాము కేవలం రెండంటే రెండు పేజీల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో సోమవారం ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ తమ మేనిఫెస్టోలోని ప్రతి హామీని తూచతప్పకుండా అమలు చేస్తామన్నారు. పాదయాత్రలో ప్రజలు ఇచ్చే సూచనలు, డిమాండ్లను మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. ప్రతి అక్షరం అమలుచేసే బాధ్యత నాది అని అన్నారు. ప్రజల సంక్షేమానికి ఇప్పటికే నవరత్నాలను ప్రవేశపెట్టామని, అవసరమైతే వాటిలో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. ప్రజలందరికీ భరోసా కల్పించేందుకే తాను ఈ ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టినట్లు ఆయన చెప్పారు.