రాష్ట్రీయం

సాగులో సుస్థిరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 6: రాష్ట్రంలో జరుగుతున్న ‘నీరు-ప్రగతి’ పనుల పురోగతిని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రశంసించారు. సిఎం చంద్రబాబు ‘నీరు- ప్రగతి’పై వారం వారం నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌లో సోమవారం గవర్నర్ కూడా పాల్గొని అధికారుల్లో స్ఫూర్తి నింపారు. ఊహించని విధంగా టెలీకాన్ఫరెన్స్ లైన్‌లోకి గవర్నర్ రావడం అధికారులు, ఇతర ఉద్యోగులను ఆశ్చర్యపర్చింది. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ పంట మార్పిడిపై శ్రద్ధ చూపాలని, వివిధ పంటల ఉత్పాదకత పెంచాలని, అప్పుడే రైతులకు మరింత ఆదాయం వస్తుందన్నారు. వర్షాలపై అన్నివేళలా ఆధారపడలేం కనుక నీటి పొదుపు, సమర్థ నీటి నిర్వహణపై రైతులను చైతన్యపరచాలని సూచించారు. రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు జలసంరక్షణ పనుల్లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వ్యవసాయంలో సుస్థిర ఆదాయం ఉంటే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని
నరసింహన్ అన్నారు. జలసంరక్షణ, వ్యవసాయం, మెటీరియల్ కాంపొనెంట్ నిధులు త్వరితగతిన ఖర్చు చేయాలన్నారు. నరేగా లక్ష్యాలైన కుటుంబ ఆదాయం పెంపు, గ్రామీణ వసతుల పెంపు, సహజ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కేంద్రం నుంచి ఆశించిన విధంగా నిధులు వస్తున్న కార్యక్రమం నరేగాయేనంటూ వాటిని సద్వినియోగం చేసుకుని, అనుకున్న లక్ష్యాలను నెరవేర్చాలని గవర్నర్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వివిధ శాఖల మధ్య సమన్వయం సమస్య లేదని, మరింత ప్రగతి సాధిద్దామని పిలుపిచ్చారు. ‘నిధులు తెస్తున్నాం. మ్యాన్ పవర్ ఉంది. అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ పురోగతి సాధించాలి’ అని సూచించారు. పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పరిశీలించిన అంశాలను నివేదిక రూపంలో అందజేయాలని, ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ‘వర్షపాతం 5శాతం లోటు ఉన్నప్పటికీ రబీ పంటలకు నీటి కొరత లేదు. సాగర్ ఆయకట్టు, కృష్ణా, గోదావరి డెల్టాలో రబీ అవసరాలకు ఇబ్బంది లేదు. రిజర్వాయర్లలో చేరిన నీటిని సమర్థంగా వినియోగించాలి. రాబోయే ఖరీఫ్ అవసరాలకు కూడా వాడుకునేలా నీటిని పొదుపు చేయాలి’ అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పూర్తిచేయాలన్నారు. రాబోయే 3నెలల్లో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశాలు జరిపేలా చూడాలన్నారు. గత నెలలో వరల్డ్ హేబిటేషన్ డే సందర్భంగా లక్ష గృహ ప్రవేశాలు జరిగిన విషయాన్ని ప్రస్తావించి, సంక్రాంతికి లక్ష, జూన్‌లో మరో లక్ష గృహ ప్రవేశాలు జరిగేలా శ్రద్ధ వహించాలని చంద్రబాబు నిర్దేశించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి కాకి సునీత మాట్లాడుతూ అంగన్‌వాడీ భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంపై జిల్లా కలెక్టర్లు శ్రద్ధ వహించాలని కోరారు.