రాష్ట్రీయం

బాధాతప్త హృదయంతో సీఎం సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ఆందోళనలో మృతి చెందిన భారతి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్టు అసెంబ్లీలో సిఎం కేసీఆర్ ప్రకటించారు. కుటుంబంలో ఎవరైనా అర్హులుంటే ఉద్యోగం కల్పిస్తామని, ఆమె పిల్లలు చిన్నవాళ్లయితే పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిలో మహిళా కార్యకర్త భారతి మృతి చెందిన విషయాన్ని అసెంబ్లీలో
ప్రధాన ప్రతిపక్షం నాయకుడు జానారెడ్డి ప్రస్తావించారు. అప్పటికే భూముల సమగ్ర సర్వేపై సభలో వాడివేడి చర్చ జరుగుతోంది. అయితే, సభను కొద్దిసేపు వాయిదావేసి భారతి మరణంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి నేత కిషన్‌రెడ్డి, టీడీపీ నాయకుడు సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్యలు జానారెడ్డి డిమాండ్‌ను బలపర్చారు. భారతి మరణంపై ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జగదీష్‌రెడ్డి తదితరులు ప్రకటించారు. అప్పటికే సమయం 2.30 కావడం, ఉద్విగ్న పరిస్థితి ఏర్పడటంతో 15 నిమిషాలపాటు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మదుసూధనాచారి ప్రకటించారు.
విచారణ జరిపిస్తాం: సిఎం
మధ్యాహ్నం 3.30కు సభ తిరిగి సమావేశంకాగానే సిఎం కెసిఆర్ భారతి మరణంపై ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ ఆందోళనలో భాగంగా 12.40 గంటల సమయంలో కలెక్టరేట్ గేట్లను తోసుకుని చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారన్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో జరిగిన తోపులాటలో అస్వస్థతకు గురైన భారతి (40) ఆస్పత్రిలో కన్ను మూసిందని అన్నారు. భారతితోపాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సుజాత, రేణుక, శంకర్‌లు కూడా ఆస్పత్రికి వచ్చారని, ఇవన్నీ వీడియోలో రికార్డు అయ్యాయన్నారు.
ఎమ్మార్పీఎస్ ఉద్యమంతో తనకూ సంబంధం ఉందంటూ గతాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు హయాంలో ఈ అంశంపై వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో తానూ ఒక సభ్యుడినని గుర్తు చేశారు. వర్గీకరణకు అనుకూలంగా పనిచేశానని, తన నిర్ణయంపట్ల కొందరు వ్యతిరేకత చూపించారన్నారు. అలాగే కేంద్రంలో తాను మంత్రిగా పనిచేసిన సమయంలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తోనూ ఈ అంశంపై చర్చించానని తెలిపారు.
ఢిల్లీ వెళదాం
ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడేందుకు అఖిలపక్షం నేతలతో ఢిల్లీ వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కెసిఆర్ అన్నారు. తొలుత అన్ని పార్టీల నేతల సంతకాలతో ప్రభుత్వం తరఫున ఒకటి రెండు రోజుల్లో ఒక లేఖను ప్రధానికి పంపిస్తానన్నారు. తర్వాత ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ తీసుకుని ఢిల్లీ వెళ్దామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎమ్మార్పీఎస్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
విపక్షాల హర్షం
ఆందోళన సందర్భంగా మరణించిన భారతి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన సాయంపట్ల విపక్షనేతలు జానారెడ్డి, కిషన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సున్నం రాజయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని పక్షాల విజ్ఞప్తిని మన్నించి సభను మంగళవారానికి స్పీకర్ వాయిదా వేశారు.