రాష్ట్రీయం

అసెం‘భళీ’ అనిపిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 7: ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా శాసనసభ సమావేశాలు అర్ధవంతం, విజయవంతంగా జరిగాయన్న సంకేతాలిచ్చేందుకు అధికార తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు అర్ధవంతంగా ముగియడం ద్వారా, ప్రతిపక్షమైన వైసీపీ ఉన్నప్పటి పరిస్థితిని, బహిష్కరించిన తర్వాత పరిస్థితిని ప్రజలే బేరీజు వేసుకునేలా సభ జరగాలని టీడీపీ నిర్ణయించింది.
ఆ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సీనియర్లు సమావేశమయి, వ్యూహరచనపై చర్చించారు. ఆ ప్రకారంగా వైసీపీ శాససభను బహిష్కరించినందున, ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషించాలని నిర్ణయించారు. దానికి సంబంధించి వివిధ సమస్యలను టీడీపీ ఎమ్మెల్యేలే సభ దృష్టికి తీసుకురానున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ, కాంగ్రెస్ తమ ప్రభుత్వంపై చేసిన ప్రతి ఆరోపణ, విమర్శలకు సభలోనే జవాబు చెప్పాలని నిర్ణయించారు. ఆ ప్రకారంగా రోజుకో సమస్యను
ప్రస్తావించి, దానికి ప్రకటన (స్టేట్‌మెంట్) కూడా ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతిపక్షాలు తమపై చేసిన ఆరోపణలకు సంబంధించిన అంశాన్ని రోజుకొకటి తామే ప్రస్తావించి , వాటికి వివరణ ఇవ్వడం ద్వారా ప్రజలకు వాస్తవాలేమిటో చెప్పాలని టీడీపీ భావిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సభలో ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా సమస్యలు సభ దృష్టికి తీసుకురావల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి సమస్యపై అధ్యయనం చేయాలని, మంత్రులను ప్రశ్నించాలని, ఆ సందర్భంగా ప్రతి ఒక్క సభ్యుడికీ మాట్లాడే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు. సభలో చర్చలన్నీ హుందాగా, పార్లమెంటరీ సంప్రదాయాలు, నిబంధనలకు అనుగుణంగా నడిపించడం ద్వారా, అసెంబ్లీ బాగా జరిగిందని ప్రజలు మెచ్చుకునేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
‘మన జవాబులన్నీ వైసీపీ కోసం అన్నట్లు కాకుండా ప్రజల కోసమే ఉండాలి. అసెంబ్లీని బహిష్కరించిన వైసీపీని ప్రజలు విమర్శిస్తున్నారు. నాయకుడికి సహనంతోపాటు సంస్కారం ఉండాలి. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ననె్నంత అవమానించి, రెచ్చగొట్టారో అంతా చూశారు. అయినా నేనెక్కడా సహనం కోల్పోలేదు. సభలోనే ఎదుర్కొన్నా. అన్నగారు అప్పుడు ఒక్కరు మాత్రమే సభను బహిష్కరిస్తే మేమంతా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటే, ఆయన (జగన్)తనను ఎన్టీఆర్‌తో పోల్చుకుంటున్నారు. ఇది పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లుంద’ని బాబు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఓ సీనియర్ నేత మాట్లాడుతూ వైసీపీ ఉన్న సభకు, లేని సభకు తేడాను ప్రజలే గమనించేలా వ్యవహరిస్తే, ప్రజలు ఇక ఆ పార్టీని అసెంబ్లీకే పంపించరని వ్యాఖ్యానించినప్పుడు నవ్వులు విరిశాయి. అంటే ఇప్పుడు మనమే ప్రతిపక్షం కదా? మనకు 1100 కాల్‌సెంటరే నిజమైన ప్రతిపక్షం తప్ప వైసీపీ కానేకాదన్నప్పుడు బాబు కూడా వారితో ఏకీభవించారు. మనం బాగా పనిచేసి ప్రజలను మెప్పిస్తే మనకు ప్రతిపక్షమే ఉండదని బాబు వ్యాఖ్యానించారు.
కాగా, 9న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇప్పటికే ప్రస్తావించాల్సిన అంశాలను గుర్తించిన పార్టీ నాయకత్వం, వాటికి సంబంధించిన వివరాలను కూడా సంబంధిత ఎమ్మెల్యేలకు ఇచ్చి ఆయా అంశాలపై కసరత్తు చేయాలని సూచించింది.