రాష్ట్రీయం

సెంట్రల్ వర్శిటీలో గడబిడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గచ్చిబౌలి, నవంబర్ 7: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో మంగళవారం మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఆయన పరిస్థితి కుదుటపడిందని ఆస్పత్రి నుంచి త్వరలోనే డిస్చార్చి చేయనున్నట్టు వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో మంగళవారం సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఇంటిగ్రేటెడ్ ఎంఎ కోర్సు చేస్తూ చదువు మధ్యలో ఆపేసిన ఆ విద్యార్థి బీర్బల్ కొజరగా గుర్తించారు. కొంతకాలంగా ఆ విద్యార్థి వేరే స్నేహితుడి హాస్టల్‌లో ఉంటున్నాడని వర్శిటీ అధికారులు పేర్కొన్నారు. మిజోరంవాసిగా గుర్తించిన బీర్బల్ రాత్రి గం.12.45లకు హెచ్‌సీయూలోని ఎల్ హాస్టల్ భవనం రెండో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు
ప్రయత్నించాడు. రక్తపు మడుగులో పడివున్న బీర్బల్‌ను హెచ్‌సీయూ సిబ్బంది వెంటనే గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్టు గచ్చిబౌలి ఇనస్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు చెప్పారు. బీర్బల్ ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణంగా భావిస్తున్నారు. అయితే బీర్బల్‌కు నిద్రలో నడిచే అలవాటు ఉందని కొందరు అంటుంటే, అతీద్రియ శక్తి ఏదో నన్ను నడిపిస్తోందంటూ కొజర చెప్పేవాడని కొందరు అంటున్నారు. నిద్రలో నడిచే అలవాటు వల్లే అతను హాస్టల్ పైనుంచి దూకినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు.

చిత్రం..బీర్బల్