రాష్ట్రీయం

పెట్టుబడులకు యూ(ఓ)కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 7: వౌలిక సదుపాయాల అభివృద్ధి, సౌర సాంకేతిక పరిజ్ఞానం, విద్య, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆతిథ్య, పర్యాటక రంగాల్లో ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ సంస్థలు ఆసక్తి చూపాయ. ఇప్పటికే యూకేకి చెందిన పలు కంపెనీలు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్నాయని, మరిన్ని రంగాల్లో ఏపీలో విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయని యూకే మాజీ మంత్రి, విదేశీ వ్యవహారాల కమిటీ చైర్‌పర్సన్ బేరొనెస్ సందీప్ వర్మ చెప్పారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో సిఎం చంద్రబాబుతో సమావేశమైన యూకే బృందం కొన్ని ప్రతిపాదనలపై చర్చించింది. ఐవోటీ ద్వారా డిజిటల్ సెక్యూరిటీ ఐడీ తయారీకి సంబంధించిన ప్రతిపాదనలను కవి హోల్డింగ్ ఏజీ చైర్మన్ అమర్‌కవి ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సంస్థ ఇప్పటికే విశాఖపట్నంలో దీనిపై ఫెజెట్టే సంస్థతో కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తోంది. సెన్సర్లు, బయోమెట్రిక్స్, జీపీఎస్ అనుసంధానంతో సురక్షిత ఐడీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు తీరుతెన్నులను పరిశీలించి రాష్ట్ర పోలీస్ శాఖ దీన్ని ఉపయోగించుకుంటుందని సిఎం చెప్పారు. ఇటీవల యూకే పర్యటన సందర్భంగా జరిగిన సిఈవోల రౌండ్‌టేబుల్ సమావేశంలో కలిసిన వర్మను ఏపీ సందర్శించాలని చంద్రబాబు కోరారు. సిఎం ఆహ్వానం మేరకు యూకే బృందం ఏపీలో పర్యటిస్తోంది. మరిన్ని యూకే సంస్థలు ఆంధ్రకు రావడంలో సహకరించాలని ఈ సందర్భంగా వర్మను బాబు కోరారు. సౌర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నైపుణ్య పెంపు, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కామనె్వల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్టనర్స్ చైర్మన్ డాక్టర్ జెఫ్రి క్లెమెంట్స్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏపీలో మానవ వనరుల సామర్థ్యం పెంపు కార్యక్రమాల్లో తమ దేశానికి చెందిన సంస్థలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ఏపీలోని వృత్తి నిపుణులకు తగిన శిక్షణ ఇచ్చేందుకు నియో ఎక్స్‌క్రాప్ట్ డైరెక్టర్ ఫరీనా సజ్జాద్ ముందుకొచ్చారు. స్మార్ట్ సిటీ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు
సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రద్దీ ఇబ్బందుల్లేని, కాలుష్య రహిత సురక్షిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలిలో బయో డీజిల్ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామని అద్వైత్ బయో ప్యూయెల్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ మంగళగిరి ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ బృందం సమర్పించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లడానికి అమర్‌కవి నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. యూకే బృందం అందించిన ప్రతిపాదనలు, సలహాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రపంచంలోని అత్యుత్తమ పద్ధతులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేస్తున్నట్టు చెప్పారు.

చిత్రం..బ్రిటన్ ప్రతినిధి బృందంతో జరిపిన భేటీలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు