రాష్ట్రీయం

జాతికే ఒక మాణిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30 : జనరల్ కెవి కృష్ణారావు భారతదేశానికి ఆణిముత్యం లాంటి వాడని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. కృష్ణారావు మృతిపట్ల విశ్వంజీ స్పందిస్తూ, కెవి కృష్ణారావు లాంటి వారు భారతదేశానికి ఎంతో అవసరమన్నారు. భారతదేశ సైన్యాధ్యక్షుని హోదాలో సమాజానికి ఎనలేని సేవ చేసి మంచి పేరుతెచ్చుకున్న ఘనత కృష్ణారావుకే దక్కిందని వివరించారు. బంగ్లాదేశ్ విముక్తి సమయంలో కృష్ణారావు సేవలు మరువలేనివని, 1971 లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో ఆయన ప్రదర్శించిన అమోఘమైన దైర్యసాహసాలు దేశానికి విజయం సాధించిపెట్టాయన్నారు. 41 సంవత్సరాల పాటు సైన్యంలో కృష్ణారావు వివిధ హోదాల్లో పనిచేసి, దేశానికి ఖ్యాతిని ఆర్జించి పెట్టారన్నారు. గుంటూరు సమీపంలోని విశ్వనగర్ (విశ్వంజీ ఆశ్రమం) లో కృష్ణారావుకు ‘మ్యాన్ ఆఫ్ విక్టరీ’ అవార్డును అందించామని గుర్తు చేశారు. నేటి యువత కృష్ణారావును ఆదర్శంగా తీసుకుని దేశానికి సేవలు అందించాలని విశ్వంజీ సూచించారు.

తాత్సారం కేంద్రానిదే!

‘విభజన’ పరిష్కారాలపై నిర్లక్ష్యం జూన్‌లోగా కార్యాలయాల తరలింపు
పరిశ్రమలకు నీటిని సరఫరా చేశాం రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ
సిఎస్ పదవి సంతృప్తినిచ్చింది మీడియాతో ఐవైఆర్ కృష్ణారావు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 30: సమైక్య రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశాలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.
సిఎస్‌గా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూళ్లతోపాటు ఢిల్లీలోని ఎపి భవన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పుల పంపకాలు తదితర అంశాలపై శాస్ర్తియ విధానంలో, వేగంగా కేంద్రం నిర్ణయాలు తీసుకోలేకపోతోందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలని, ఏకాభిప్రాయం ఉండాలంటూ కేంద్రం పేర్కొంటోందని, రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ-ఎపిల అభిప్రాయాలు భిన్నంగానే ఉంటాయి తప్ప ఒకే విధంగా ఉండే అవకాశం లేదన్నారు. అందుకే కేంద్రమే న్యాయమైన నిర్ణయాలను తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర రాజధానికి సంబంధించిన కార్యాలయాలను విజయవాడకు 2016 జూన్‌లోగా తరలించాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, ఇందులో మరో ఆలోచన ఏదీ లేదని కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్భ్రావృద్ధిలో పరిశ్రమలు కీలకమైన భూమిక పోషిస్తాయని, అందుకే భూమి కేటాయింపు, వౌలిక సదుపాయల కల్పనపై దృష్టి సారించానని ప్రధాన కార్యదర్శి చెప్పారు. అనంతపురం శ్రీసిటి, దొనకొండ ప్రాంతం తదితర పారిశ్రామికవాడల్లో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు నీటిని సరఫరా చేసే అంశాలను పరిష్కరించామన్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కీలకమైన భూసేకరణ చేశామని, ఈ భూములను రైల్వేశాఖకు అప్పగించామని వివరించారు. ఇప్పటికే విశాఖ, కాకినాడలను స్మార్ట్ సిటీలుగా కేంద్రం ప్రకటించిందని, త్వరలో తిరుపతిని కూడా స్మార్ట్ జాబితాలో చేర్చే అవకాశం ఉందన్నారు. స్థానిక సంస్థలకు 13 వ ఫైనాన్స్ కమిషన్, 14 వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా పెద్దమొత్తంలో నిధులు లభించేలా చూశామని వివరించారు.
37 సంవత్సరాలుగా ఐఎఎస్ అధికారిగా పనిచేశానని, ఇతర సర్వీసులను కలిపితే 39 సంవత్సరాలపాటు ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగానని, ఇంతకాలం సంతోషంగా పనిచేసిన తృప్తి మిగిలిందన్నారు. ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా దాదాపు 20 నెలలపాటు పనిచేసిన సమయంలో తనకు చేదోడుగా నిలిచిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని కృష్ణారావు పేర్కొన్నారు.