రాష్ట్రీయం

అసెంబ్లీ, కౌన్సిల్ నిరవధిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే వచ్చే నెల 4నుంచి తిరిగి సమావేశమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం అసెంబ్లీలో ‘రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు- నూతన పాలనా వ్యవస్థ’ అనే అంశంపై స్వల్ప వ్యవధి ప్రశ్న నియమం కింద చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమాధానమిస్తూ జిల్లాల, రెవెన్యూ, మండలాల పునర్విభజన కోసం ఇంకా తమపై వత్తిడి ఉందన్నారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా పంచాయతీ, మున్సిపాలిటీల కోసం చట్టం చేద్దామన్నారు. సభను వాయిదా వేసినా, తిరిగి సమావేశమవుదామన్నారు. ఈమేరకు వచ్చే నెల 4నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇలాఉండగా గత నెల 27న ప్రారంభమైన అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు 16 రోజుల పాటు జరిగాయి. అసెంబ్లీ 69 గంటల పాటు జరిగింది. ఉభయ సభలూ 11 బిల్లులకు ఆమోదం తెలిపాయి. హరితహారం, కెసిఆర్ కిట్లు, భూ రికార్డుల ప్రక్షాళన, మైనారిటీ సంక్షేమం, రైతులకు రూ.8 వేల పెట్టుబడి సాయం, రైతు సమన్వయ సమితులు, నిరుద్యోగ సమస్య, గురుకుల పాఠశాలలు, విద్యా సంస్థల్లో వౌలిక సదుపాయాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ తదితర అంశాలపై చర్చించారు. పిడీ చట్ట సవరణ, పట్టాదారు పాస్ పుస్తకాలు, వ్యాట్ సవరణలు-2, గేమింగ్, ఎక్సైజ్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పోరేషన్, లోకాయుక్త, థార్మిక, అధికార భాషా బిల్లులకు ఆమెదం తెలిపాయి. ఇంకా 24 గంటల విద్యుత్తు సరఫరా, చేనేత పరిశ్రమ-కార్మికులు, ప్రపంచ తెలుగు మహాసభలు, ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతిపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేశారు.