రాష్ట్రీయం

కుటుంబం బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, నవంబర్ 18: అప్పుల బాధతో ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని ఆవులనాత్తం గ్రామం వద్ద శనివారం చోటుచేసుకుంది. రైల్వే ఇన్స్‌పెక్టర్ అశోక్‌కుమార్ కథనం మేరకు కుప్పం మండల పరిధిలోని కొటాలూరు గ్రామానికి చెందిన అన్బలగన్ (31)కు, కుప్పం పట్టణం అర్బన్ కాలనీకి చెందిన లక్ష్మి (27)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. పెళ్లైన తరువాత ఆరు నెలలపాటు భర్త ఇంటిలో కాపురం ఉన్న వీరు, బతుకుదెరువు కోసం కుప్పం పట్టణానికి చేరుకున్నారు. అప్పటి నుండి స్థానికంగా వున్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లక్ష్మి నర్సుగా పని చేస్తోంది. భర్త అన్బలగన్ ఆసుపత్రి సమీపంలోనే టీ కొట్టు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం వీరి కుమార్తె జనని (3) పుట్టినరోజు వేడుకలను అర్బన్ కాలనీలోని అత్తగారి ఇంటిలో ఘనంగా జరుపుకున్నారు. అటుతర్వాత వీరు ముగ్గురూ కొటాలూరులోని అమ్మగారి ఇంటికి వెళ్లొస్తామని చెప్పి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. శనివారం ఉదయం బెంగళూరు నుండి చెన్నై వెళ్లే రైలు మార్గంలో మండల పరిధిలోని ఆవులనాత్తం గ్రామ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మూడు సంవత్సరాల కుమార్తె జననిని గొంతుకోసి చంపి రైలు పట్టాలపై పడవేసి అటు తర్వాత భార్యాభర్తలిద్దరూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్స్‌పెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు.