ఆంధ్రప్రదేశ్‌

ఎక్కడి రైళ్లక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ రాజమండ్రి/ విశాఖపట్నం, జనవరి 31: తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును కాపు గర్జన ఆందోళనకారులు దగ్ధం చేయడంతో హౌరా- చెన్నై ప్రధాన రూట్లో రైళ్ల రాకపోకలు స్ధంభించాయి. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా దగ్ధం కావడంతోపాటు రైల్వే సిగ్నల్, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విశాఖపట్నం- విజయవాడ మధ్య ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోవడంతో, ఆకస్మిక పరిణామానికి రైళ్లలోని ప్రయాణికులు, రైలు ఎక్కేందుకు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌ను పిఠాపురం, సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను సామర్లకోట జంక్షన్, చెన్నై నుంచి సంత్రగాచి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ను రాజమండ్రి, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను కొవ్వూరు, యశ్వంత్‌పూర్- పూరి ఎక్స్‌ప్రెస్‌ను ఏలూరు వద్ద, హైదరాబాద్- హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను పెదఅవుటపల్లి, చెన్నై- హౌరా కోరమాండల్‌ను తాడేపల్లిగూడెం, తిరువనంతపురం- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌ను గన్నవరం, విశాఖపట్నం- తిరుపతి తిరుమల ఎక్స్‌ప్రెస్, హౌరా- వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌లను తుని, భువనేశ్వర్- బెంగళూరు కంటోనె్మంట్ ఎక్స్‌ప్రెస్‌ను గుళ్లిపాడు, హౌరా- చెన్నై సెంట్రల్ మెయిల్‌ను నర్సీపట్నం రోడ్, విశాఖపట్నం- హజరత్ నిజాముద్దీన్ లింక్‌ను యలమంచిలి, గుంటూరు- విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను హంసవరం, కాకినాడ పోర్టు-విశాఖ ప్యాసింజర్‌ను రవికంపాడు స్టేషన్ల వద్ద నిలిపివేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం వెల్లడించింది. హౌరా, భువనేశ్వర్ నుంచి విశాఖప్నం వచ్చే రైళ్లను విజయనగరం, విశాఖప్నం, నర్సీపట్నం వద్ద నిలిపివేశారు. కాగా విశాఖ- రాజమండ్రి ప్యాసింజర్, రాయగడ- విజయవాడ ప్యాసింజర్, విశాఖ- కాకినాడ ప్యాసింజర్, విశాఖ- మచిలీపట్నం ప్యాసింజర్, విజయవాడ- రాయగడ ప్యాసింజర్, మచిలీపట్నం- విశాఖపట్నం ప్యాసింజర్, నరసాపూర్- విశాఖ ప్యాసింజర్, నిడదవోలు- భీమవరం ప్యాసింజర్, విశాఖ నుంచి వచ్చే గోదావరి, గరీబ్థ్,్ర ఏసీ ప్రత్యేక రైలు, సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్టు ద.మ. రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల కోసం మూడుచోట్ల హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. విజయవాడ- 0866-2575038, రాజమండ్రి- 0883-2420451, 0883-2420543, తుని- 08854-252172 హెల్ప్‌లైన్ కేంద్రాలను సమాచారం కోసం సంప్రదించవచ్చని పేర్కొంది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన సంఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ దర్యాప్తు బృందాలను రంగంలో దించింది. ఘటనకు సంబంధించిన బాధ్యులపై కేసులు నమోదు చేసే పనిలో రైల్వే పోలీసులు నిమగ్నమయ్యారు.
ఇదిలావుండగా తుని రైల్వే స్టేషన్‌లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం అనంతరం పరిణామాలను దక్షిణ మధ్య రైల్వే రవీంద్రగుప్తా సమీక్షించారు. రైల్వే ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల విభాగం అదనపు డిజితో టెలిఫోన్‌లో మాట్లాడారు. ప్రయాణికుల భద్రత, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌పిఎఫ్‌ను కూడా రంగంలో దించి ప్రయాణికులకు కావాల్సిన ఆహారం, తాగునీరు, మందులు వంటి వాటిని అందిస్తున్నట్టు రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్ నుంచే కాకుండా విజయవాడ రైల్వే డివిజన్ నుంచి అధికార బృందాలను తుని రైల్వే స్టేషన్‌కు పంపించారు. ప్రధాన రైల్వే లైన్లో ఈ సంఘటన జరగడంతో పూర్తిగా పరిస్థితి మెరుగుపడే వరకూ రైళ్లను నడిపే పరిస్థితి కనిపించడం లేదు. మంత్రి గంటా శ్రీనివాసరావు తుని సంఘటన నేపథ్యంలో పరిస్థితిని అధికారులతో సమీక్షించారు.
పలు ఆర్టీసీ సర్వీసులు రద్దు
విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే రెండు గరుడ ఎక్స్‌ప్రెస్‌లు, బెంగళూరు వెళ్లే ఒక గరుడ ఎక్స్‌ప్రెస్‌ను ఆర్టీసీ రద్దు చేసింది. విశాఖపట్నం నుండి రాజమండ్రి వచ్చే సింగిల్ స్టాప్ సర్వీసులు ఎనిమిది రద్దయ్యాయి. విశాఖపట్నం నుండి రాజమండ్రి వచ్చే మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు మూడు రద్దుచేశారు. మరికొన్ని బస్సులు వేరే మార్గంలో నడుపుతున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తూర్పు గోదావరి, ఆపైకి వెళ్లే అన్ని సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన గరుడ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నిలిపివేశారు.