ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక రైళ్లకు పెరుగుతున్న డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 25: సాధారణ రోజుల్లోనూ రైళ్ళకు డిమాండ్ పెరిగిపోతోంది. పండుగలు, పెళ్ళిళ్ళు, వేసవి సెలవుల్లోనే కాకుండా ఏడాది పొడవునా పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే ప్రత్యేక రైళ్ళను పట్టాలెక్కిస్తోంది. ఇలా ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ళల్లో కొన్నింటిని కొనసాగించాల్సి వస్తోంది. ఇందులో భాగంగానే రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్ళు నడుస్తుండగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి తరలివెళ్ళే భక్తులు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రోజురోజుకూ పెరుగుతున్నందున విశాఖ-తిరుపతి మధ్య ప్రత్యేక ఏసీ రైలును ఈస్ట్‌కోస్ట్‌రైల్వే ప్రవేశ పెట్టబోతోంది. వచ్చేనెల 4 నుంచి ఈ ప్రత్యేక రైలు ప్రారంభమవుతుంది. వచ్చేనెల 3, 10, 17, 24, 31 తేదీల్లో తిరుపతి నుంచి రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజున ఉదయం 10.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి వచ్చేనెల 4, 11, 18, 25, జనవరి ఒకటిన రాత్రి 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు తిరుపతికి చేరుకుంటంది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట స్టేషన్‌లో ఈ రైలు ఆగుతుంది. ఏసీ త్రీ టైర్ కోచ్‌లతోనే ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది. కాగా, ప్రతిరోజూ విశాఖ నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుండగా, వారంలో ఒక్కో రోజు బిలాస్‌పూర్-తిరుపతి, పూరీ-తిరుపతి, హౌరా-తిరుపతి మధ్య మరో మూడు రైళ్లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా విశాఖ-తిరుపతి, తిరుపతి-విశాఖ మధ్య డబుల్ డెక్కర్ ప్రత్యేక రైలు కూడా నడుస్తోంది. అయినా తిరుపతికి తరలివెళ్ళే భక్తులకు బెర్తులు లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందువల్ల అపుడపుడు ప్రత్యేకరైళ్ళు నిర్వహిస్తున్నట్టు వాల్తేరు డివిజన్ అధికారి ఒకరు తెలిపారు. గౌహతి-కొచ్చివేల్ మధ్య, కాచిగూడ-విశాఖ మధ్య ప్రత్యేక రైళ్ళు ఈ నెల మొదటి వారంలో ప్రారంభమయ్యాయి. అయితే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా నిర్వహించే వీటిని మరికొన్నాళ్ళపాటు కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రయాణికులు డివిజన్ అధికారులను కోరుతున్నారు. ఇవి కాకుండా విశాఖ నుంచి షిరిడి, చెన్నై, హౌరా, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు మరికొన్ని ప్రత్యేక రైళ్ళు నిర్వహిస్తే ఇబ్బందులు తగ్గుతాయని ప్రయాణికులు కోరుతున్నారు.