రాష్ట్రీయం

అందరూ ఆహ్వానితులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: తెలంగాణ యాస, భాష, జీవన సౌందర్యాన్ని ప్రపంచమంతా పరివ్యాప్తి చేసే విధంగా 15వ తేదీ నుండి 19వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు, నిర్వహణపై సచివాలయంలోని సి బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు. ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి నవంబర్ ఒకటో తేదీ నుండి 7వ తేదీ వరకూ ఆఫ్‌లైన్‌లో నమోదు కార్యక్రమం జరిగిందని, 7వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో నమోదు జరిగిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో 7920 మంది అతిథులు, ప్రతినిధులు విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి , తెలంగాణ నుండి నమోదు చేసుకున్నారని అన్నారు. ఇందులో 40 దేశాల నుండి 160 మంది, ఇతర రాష్ట్రాల నుండి 1167 మంది , తెలంగాణ నుండి 6వేల మంది పేర్లు నమోదుచేసుకున్నారని అన్నారు. విదేశాల నుండి 37 మంది, ఇతర రాష్ట్రాల నుండి 56 మంది అతిథులను తెలంగాణ రాష్ట్రం ఆహ్వానిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహ్వానించే అతిథులకే వసతులు, రాకపోకల చార్జీలు ఇస్తున్నామని, విదేశాలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రతినిధులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని కడియం శ్రీహరి వివరించారు. తెలంగాణ నుండి సభలకు హాజరయ్యే వారికి వసతులు కల్పించడం లేదని, అదే విధంగా ఆన్ డ్యూటీపై వచ్చే తెలుగు పండితులకు కూడా ఎలాంటి చార్జీలు, వసతులు కల్పించకుండా ఇక్కడ మధ్యాహ్నం భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సభలకు హాజరవుతున్నందున వారికి ఆన్ డ్యూటీ వసతి కల్పిస్తున్నామని వెల్లడించారు.
ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేయడంలో భాగంగా తెలంగాణ వంటకాలు, తెలంగాణ రచనలు, చరిత్ర, చేనేతలు, చేతివృత్తులు, కళాప్రదర్ళనలు, ఆలయాలు, నాణాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మహాసభలకు వచ్చే వారికి ఎక్కడెక్కడ ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయో, వేటికి హాజరుకావాలో నిర్ణయించుకునేందుకు వీలుగా ముందుగానే ఐదు రోజుల మహాసభల కార్యక్రమాలను ప్రచురించి అందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలను గొప్పగా నిర్వహించుకుంటున్న సందర్భంగా వీటికి అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. కొంత మంది సభలను బహిష్కరించారన్న ప్రశ్నకు బదులిస్తూ ఇది వారిష్టమని నందిని సిద్దరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్గ సబ్ కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, కె తారకరామారవు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ్ధర్, తెలుగు వర్శిటీ విసి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, సిఎం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్, టూరిజం శాఖ కార్యదర్శి బి వెంకటేశ్, విద్యాశాఖ స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.